Give Up Gas Subsidy, Prime Minister Narendra Modi Urges Those Who Can Afford It

Prime minister narendra modi launches give up gas subsidy campaign urges those who can afford it

Prime Minister Narendra Modi, Modi launches Give Up Gas Subsidy campaign, Modi appealed well off people to give up subsidised cooking gas, modi to reduce dependence on energy imports, surrender LPG would result in a savings of Rs. 100 crore,

Prime Minister Narendra Modi today appealed to the well off people to give up subsidised cooking gas, and expressed his government's resolve to reduce dependence on energy imports by 10 per cent by 2022.

తాహత్తు వున్నవారు సబ్సీడీని తిరిగిచ్చేయండి..!

Posted: 03/27/2015 07:44 PM IST
Prime minister narendra modi launches give up gas subsidy campaign urges those who can afford it

వంటగ్యాస్ సిలిండర్ల సబ్సీడిని స్వచ్చందంగా ప్రభుత్వానికి తిరిగి ఇచ్చే ఉద్యమంలో తాహత్తు వున్నవారంతా చేరాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. మార్కెట్ ధరలకు గ్యాన్ ను కోనుగోలు చేసే శక్తి వున్న ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తే.. ఆ నిధులను నిజమైన పేదల అభ్యున్నతికి వినియోగిస్తామని చెప్పారు.  ప్రస్తుతం మనం ఇంధనం కోసం 77 శాతం దిగుమతుల మీదే ఆధారపడుతున్నామని, 2022 నాటికి విదేశాల ఇంధన దిగుమతులను పది శాతం మేర తగ్గించి.. వారిపై ఆధారపడకుండా చూస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎల్పీజీ రాయితీ వదులుకునే ప్రోత్సాహక కార్యక్రమాన్ని ఢిల్లీలో ప్రారంభించిన నరేంద్రమోడీ ఈ సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు.

తన పిలుపుకు స్పందించిన 2.8 లక్షల మంది మంది వినియోగదారులు తమ సబ్సిడీలను వదులుకోవడం వల్ల ఖజానాకు రూ. 100 కోట్లు ఆదా అయ్యిందని చెప్పారు. ఇలా ఆదా చేసిన సొమ్ముతో వాళ్లకు స్వచ్ఛమైన ఇంధనాన్ని పొందే అవకాశం ఉంటుందని మోదీ అన్నారు. అభివృద్ధికి ఇంధన రంగంలో స్వావలంబన అత్యవసరమని పేర్కొన్నారు. ప్రధాని జన ధన యోజన పథకం కింద ఇప్పటికి దేశంలోని 12 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరుచుకున్నారని, ఎక్కడ ఎలాంటి అవినీతికి అస్కారం లేకుండా సంబంధిత లబ్దిదారులు ఖాతాల్లోకే నగదు బదిలీ పథకం ద్వారా నేరుగా గ్యాస్ సబ్సిడీ మొత్తం బదిలీ అవుతుందని మోదీ తెలిపారు. నాలుగేళ్లలో కోటి కుటుంబాలకు పైపుల ద్వారా వంటగ్యాస్ కనెక్షన్ అందిస్తామని ప్రధాని స్పష్టం చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles