president commutes death sentence of a convict to life imprisonment

President commutes death sentence of a convict to life imprisonment

president pranab mukharjee, president commutes death sentence convict to life imprisonment, death sentence convict, life imprisonment

president commutes death sentence of a convict to life imprisonment

కర్కోటకుడిపై కరుణ చూపిన దేశాధ్యక్షుడు..!

Posted: 03/27/2015 07:09 PM IST
President commutes death sentence of a convict to life imprisonment

కన్నబిడ్డలను, కట్టుకున్న సహధర్మచారిణిని హత్య చేసిన కర్కోటకుడిపై దేశాధ్యక్షుడు కరుణను చూపాడు. ఈ కేసులో మరణశిక్ష పడిన ఖైదీకి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ క్షమాభిక్ష ప్రసాదించారు. తనకు క్షమాభిక్ష ప్రసాదించమంటూ మన్ మహదూర్ అనే ఖైదీ పెట్టుకున్న అర్జీపై  రాష్ట్రపతి మరణశిక్షను జీవితఖైదుగా మారుస్తూ ఇవాళ సంతకం చేశారు. అసోంలోని దిబ్రూగర్ ప్రాంతానికి చెందిన మన్ బహదూర్ దివాన్, భార్య గౌరి, కుమారులు  రాజీబ్, కాజీబ్లను  2002 సెప్టెంబర్లో కిరాతకంగా  హత్య చేశాడు.   అంతేకాకుండా మన్ మహదూర్.. గతంలో కూడా పొరుగింటి వ్యక్తిని హత్య చేసి పోలీసులకు లొంగిపోయిన నేర చరిత్ర ఉంది.

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రతిపాదన మేరకు  రాష్ట్రపతి  ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  వివిధ కేసుల్లో కోర్టులు మరణశిక్ష విధించిన దోషులు, తమకు క్షమాభిక్ష ప్రసాదించమంటూ  విన్నవించుకోవడం, వాటిని పరిశీలించిన మీదట రాష్ట్రపతి నిర్ణయం ప్రకటించడం  ఆనవాయితీ.  అయితే నిఠారీ వరుస హత్యల కేసులో మరణశిక్ష పడిన  సురేందర్ కోలీ,   22 మందిని హత్యచేసిన  యాకూబ్ మీనన్ పిటిషన్లను  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇటీవల తిరస్కరించిన సంగతి తెలిసిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : President  commutes  death sentence convict  life imprisonment  

Other Articles