తాను బాలివుడ్ స్టార్ గా పేరుప్రఖ్యాతులు వున్నందునే పోలీసులు తనపై తప్పుడు కేసు బనాయించారని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన వాంగ్మూలన్ని వినిపించారు.2002 సెప్టెంబర్ 28న హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న సల్మాన్ ఖాన్ ఇవాళ కోర్టు మెట్లుఎక్కారు. కోర్టు బోనులో నిలబడి తన వాంగ్మూలాన్నివినిపించారు. తుది వాదనలు ప్రారంభించేందుకు వీలుగా సల్మాన్ వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సిందిగా ఇటీవల కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన కోర్టుకు హాజరయ్యారు.
కోర్టులో వాంగ్మూలం వినిపిస్తున్న క్రమంలో కోర్టు హాలులో మిడియాను అనుమతించవద్దని ఆయన పెట్టుకున్న పిటీషన్ ను న్యాయమూర్తి డీ.ఎస్ దేశ్ పాండే తిరస్కరించారు. అయితే విచారణ పూర్తయ్యేవరకు వివరాలు వెల్లడి చేయొద్దని మీడియాను కోరారు. 2002లో మద్యం మత్తులో కారు నడిపి ఫుట్పాత్ మీద నిద్రిస్తున్నఒకరు మరణించడానికి, నలుగురు గాయాలకు బాధ్యుడిగా అభియోగాలు నమోదైన నేపథ్యంలో సల్మాన్ ఖాన్ తన పైన సత్యదూరమైన కథనాలతో కేసును బనాయించారని చెప్పారు.
వాంగ్మూలంలో సల్మాన్ ఖాన్ చెప్పిన విషయాలు ఇవే:
* కారు ప్రమాదం జరిగినప్పుడు నేను కారు నడపడం లేదు.
* కారు ప్రమాదంలో తన వైపునున్న కారు జామ్ కావడంతోనే డ్రైవర్ వైపు డోర్ నుంచి దిగాను.
* కారు ప్రమాద ఘటనకు తనకు ఏ సంబంధమూ లేదు. అది పూర్తిగా తప్పుడు కేసు
* కారు ప్రమాదం జరిగినప్పుడు నేను మద్యం సేవించివున్నానడం అబద్దం
* ప్రమాదం సంభవించగానే నా డ్రైవర్ అశోక్ సింగ్ పోలీసులకు లొంగిపోయాడు
* పోలీసులు నా డ్రైవర్ మాటను లక్ష్యపెట్టకుండా నాపై కేసు నమోదు చేశారు
* ఆ రోజున డ్రైవర్ తెల్లని చోక్కా, బ్లూ డెనిమ్ జీన్స్ ధరించాడు
* నేను చెప్పినదాని కంటే ఢిపెన్స్ సాక్షులు చెప్పిన వాటినే పరిశీలిస్తాను.
* నా రక్తనమూనాలు తీసుకున్న బాలశంకర్ నిపుణుడు కాదు
* రక్తంలో మద్యం కలిసిందన్న ప్రోసీడింగ్స్ కూడా అతనికి తెలియవు
* బాలశంకర్ నివేదికను కెమికల్ అనాలసిస్ నిఫుణులు తోసిపుచ్చారు.
* కెమికల్ అనాలసిస్ నిఫుణులుకు నా రక్త నమూనాలలో మధ్యం వున్నట్లు తేలలేదు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more