In india vs bangladesh second quarter finals india choose to bat

bangladesh, india, worldcup, toss, batting

in india vs bangladesh second quarter finals india choose to bat. in the world cuo 2015 india won the toss and choose to bat. indian team captain express to win in this match.

టీమిండియా విక్టరీ కొనసాగేనా.. బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

Posted: 03/19/2015 09:28 AM IST
In india vs bangladesh second quarter finals india choose to bat

వరల్డ్ కప్ లో భాగంగా లో భాగంగా నేడు జరగతున్న బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్ లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఎంత మాత్రం ఆలస్యం చెయ్యకుండా బ్యాటింగ్ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ మ్యాచ్ లో గెలుస్తామన్న దీమాను ధోని ఈ సందర్భంగా వ్యక్తం చేశాడు. పక్కా ప్లానింగ్ తో బరిలోకి దిగుతున్నామని ధోనీ చెప్పాడు.

టీమిండియా  కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో రికార్డుకు అంగుళం దూరంలో నిలిచాడు. కెప్టెన్ గా విక్టరీలతో సెంచరీకి చేరువయ్యాడు.  ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే కెప్టెన్‌గా 100 వన్డేలు గెలిపించిన ఘనత ధోని సొంతమవుతుంది. ఓవరాల్‌గా పాంటింగ్ (165),  బోర్డర్ (107) అతనికంటే ముందున్నారు. హ్యాన్సీ క్రానే(99), స్టీఫెన్ ఫ్లెమ్మింగ్(98) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఈ ప్రపంచకప్ లో టీమిండియాకు డబుల్ హ్యాట్రిక్ విజయాలు అందించిన ధోని సెంచరీల విక్టరీని అందుకుంటాడో లేదో ఈ మ్యాచ్ లో తేలిపోతుంది. అయితే ఈ మ్యాచ్ లో ధోని విజృంభించి ఆడతాడని ధోనీ అభిమానులు ఎంతో ఆశగా ఉన్నారు. మొత్తానికి ధోని, టీమిండియా పర్ఫామెన్స్ పై అందరూ ఆసక్తిగా ఉన్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bangladesh  india  worldcup  toss  batting  

Other Articles