Nizamabad mp kcr daughter kavitha ask to establish cucumber board

mp kavitha, nizamabad, parliament, cucumber, kavitha, kcr daughter

nizamabad mp, kcr daughter kavitha ask to establish cucumber board. in the parliament sessions mp kavitha suggested to establish a cucumber board in india.

నిజామాబాద్ ఎంపీ కవిత నోట.. 'పసుపు' మాట

Posted: 03/19/2015 08:42 AM IST
Nizamabad mp kcr daughter kavitha ask to establish cucumber board

తెలంగాణ సిఎం కెసిఆర్ కు పసుపు అంటేనే పడదు. పసుపు చొక్కాల వాళ్లంటే పరమ చిరాకు పడతారు, కానీ కెసిఆర్ కూతురు మాత్రం పసుపు గురించి పార్లమెంట్ లొ మాట్లాడింది. పసుపుకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలని, భారత దేశంతోపాటు ప్రపంచంలోని పలు దేశాల్లో దీనిని ఆహారం, మందుల త.యారీ, అలంకరణ సామాగ్రి తయారీలో ఉపయోగిస్తారని ఆమె వివరించారు. అమెరికా మన పసుపుపై పేటెంట్ కోసం ప్రయత్నించిందన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ సమావేశాల్లో ఈ అంశంపై వాడి వేడి చర్చ జరుగుతున్న నేపథ్యంలో మనం జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతో ఉందని కవిత సూచించారు.

ఇంతకీ ఇంత చర్చ ఎందుకు జరిగింది అనుకుంటున్నారా.. పసుపు రైతుల ప్రయోజనాలను కాపాడటంతో పాటు డబ్ల్యుటిఓలో మన ప్రయోజనాలను కాపాడుకునేందుకు వెంటనే పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని టిఆర్‌ఎస్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లోక్‌సభ జీరో అవర్‌లో ఆమె ఈ విషయాన్ని ప్రస్తావించారు.  మన ప్రయోజనాలను కాపాడుకునేందుకు వెంటనే పసుపు బోర్డును ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి ఈ విషయంలో చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. పసుపు బోర్డును ఏర్పాటు చేయటం ద్వారా జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జిఐ) ముద్ర సంపాదించుకునేందుకు కృషి చేయాలని సూచించారు. పసుపుకు కనీస మద్దతు ధరను ప్రకటించాలని డిమాండ్ చేశారు. మొత్తానికి నిన్నటి దాకా పసుపు అమంగళం అన్న తెలంగాణ కొంత మంది నేతలు ఇప్పుడు పసుపు గురించి బాగా తెలుసుకున్నట్లున్నారు. మరి కెసిఆర్ ఎప్పుడు తెలుసుకుంటారో.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mp kavitha  nizamabad  parliament  cucumber  kavitha  kcr daughter  

Other Articles