In kerala assembly women mla harrased by male mla

kerala, women, ldf, molestation, images

Images of elected members pushing and shoving each other, throwing on top of the Speaker's table, these unruly scenes that played out in the Kerala state legislative assembly on March 13 will not fade away from Keralites' mind soon. But at the same time there were images of women MLAs from LDF being pushed, shoved, falling down and even an allegation of molestation.

ఛీ.. వాడు ఎమ్మెల్యేనా.. కేరళ అసెంబ్లీలో దారుణం

Posted: 03/19/2015 10:07 AM IST
In kerala assembly women mla harrased by male mla

కేరళ అసెంబ్లీలో బడ్జెట్ ను ఎలా ప్రవేశపెడతారంటూ రచ్చరచ్చ చేసి మీడియా కెక్కిన కేరళ అసెంబ్లీ తాజగా మరో దారుణానికి కేంద్రంగా మారింది. అవినీతి మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టకూడదని ప్రతిపక్షనేతలు ఏకంగా అసెంబ్లీని ముట్టడించి, బజారు మనుషుల్లా తిట్టుకున్నారు.. కొట్టుకున్నారు. అయితే ఓ కేరళ ఎమ్మెల్యే మహిళా ఎమ్మెల్యే తనను కొరికిందని ఫిర్యాదు కూడా చేశాడు. కానీ ఈ ఘటనలో కొత్తగా కొన్ని విషయాలు బయటికి వస్తున్నాయి. మహిళ ఎమ్మెల్యేల పట్ట అసభ్యంగా ప్రవర్తించిన ఎమ్మెల్యేల దాష్టికాలు బయటపడ్డాయి.

కేరళ అసెంబ్లీలో అరికారపార్టీ ఎమ్మెల్యే శివదాసన్ తనను చేయి పట్టి లాగడమే కాకుండా మోకాళ్లతో వెనక నుండి తన్నాడని మహిళా ఎమ్మెల్యే జమీలా ప్రకాశం ఆరోపించారు. కేరళ అసెంబ్లీలో జరిగిన నాటి ఘటనకు సంబందించి 141 ఫోటోలను విడుదల చేసిన మహిళా ఎమ్మెల్యేలు, వాటిని చూపిస్తూ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే తన నడుంపై చేయి వేసిన శివదాసన్ చేయి వేయగా ఆయన నుండితప్పించుకోవడానికి చేయి కొరకాల్సి వచ్చిందని ఎమ్మెల్యే జమీలా ప్రకాశం వెల్లడించింది. అలా ప్రజాప్రతినిధులుగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా సాటి మహిళా ఎమ్మెల్యేలపై అసభ్యంగా ప్రవర్తించడం ఏంటని సర్వత్రా నిరసన వ్యక్త మవుతోంది. మరి కేరళ అసెంబ్లీ స్పీకర్ ఆ కీచక ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kerala  women  ldf  molestation  images  

Other Articles