Telanagana finance minister eetala rajender sentences intersting statements on cm for arrange lunch

bhadrachalam, eetela, rajender, telanagana, cm, kcr, telanagana, council

telanagana finance minister eetala rajender sentences intersting statements on cm for arrange lunch. in telanagana council ponguleti sudhakarreddy questions on bhadrachalam for sriramanavami.

నేనైతే టిఫిన్ మాత్రమే.. సిఎం భోజనం పెడతారు

Posted: 03/19/2015 08:32 AM IST
Telanagana finance minister eetala rajender sentences intersting statements on cm for arrange lunch

శ్రీరామనవమి వేడుకలు దగ్గరపడుతున్నా, ఇప్పటి వరకు భద్రాచలంకు సర్కారు బడ్జెట్‌లో స్థానం కల్పించలేదని కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సిఎం ప్రకటిస్తారని సుధాకర్‌రెడ్డి సంతృప్తి చెందకపోవటంతో..నేనైతే కేవలం టిఫిన్ మాత్రమే పెట్టగలనని, కళ్యాణానికి హజరుకానున్న సిఎం కెసిఆర్ అయితే భోజనం చేయించే తరహాలో కేటాయింపులు జరిపే అవకాశముందని సమాధానమిచ్చారు.

తెలంగాణ మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో అదికారపార్టీ నేతలను పలు సమస్యలపై నిలదీశారు కాంగ్రెస్ నేతలు. మొత్తం బడ్జెట్, కేటాయింపులు, నిధుల సమీకరణ, విద్యుత్ ఉత్పత్తి వంటి ప్రశ్నలకు ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ మధ్యాహ్నం మూడు గంటల వరకు సభ్యుల సందేహాలను నివృత్తి చేశారు. 2వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రయత్నాలు చేస్తున్నామని ప్రకటనలు చేయటం బాగా ఉందని,  ప్రజలపై ఎలాంటి పన్నుల భారం మోపబోమని సమాధానం చెప్పిన ఈటెల చెల్లించేవారైతే కచ్చితంగా చెల్లించాలని, స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెల్లించే విధంగా వారిని చైతన్యవంతులను చేస్తామని సమాధానం చెప్పారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bhadrachalam  eetela  rajender  telanagana  cm  kcr  telanagana  council  

Other Articles