Election commission notice to 6 parties on poll expenditure

Election Commission, Parties, Aam Aadmi Party,Jharkhand Mukti Morcha, Lok Sabha, notice, expenditure, elections

The Election Commission on Wednesday issued notice to six political parties, including the Aam Aadmi Party (AAP) and the Jharkhand Mukti Morcha(JMM), for their failure to submit expenditure statements for last year's Lok Sabha elections.

ఆ పార్టీలపై ఎలక్షన్ కమీషన్ ఆగ్రహం.. నోటీసులు జారీ

Posted: 03/19/2015 08:23 AM IST
Election commission notice to 6 parties on poll expenditure

గత లోక్‌సభ ఎన్నికల్లో తాము చేసిన ఖర్చులకు సంబంధించిన స్టేట్‌మెంట్లను దాఖలు చేయలేదు. దాంతో ఎన్నికల కమిషన్ ఆమ్ ఆద్మీ పార్టీ సహా ఆరు రాజకీయ పార్టీలకు గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరిస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఖర్చులకు సంబంధించి స్టేట్‌మెంట్లు దాఖలు చేయడానికి 20 రోజుల చివరి అవకాశం ఇచ్చిన ఇసి నిబంధనలు పాటించనందుకు ఎన్నికల గుర్తుల (రిజర్వేషన్, కేటాయింపు) ఉత్తర్వులోని 16(ఎ) సెక్షన్‌లోని నిబంధనల కింద, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా గుర్తింపు రద్దు చేస్తామంటూ పార్టీలకు హెచ్చరిక చేసింది. ఈ రోజు ఇసి నోటీసులు జారీ చేసిన పార్టీల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్‌ప్రదేశ్, జార్ఖండ్ ముక్తిమోర్చా (జెఎంఎం) కేరళ కాంగ్రెస్ (మణివర్గం), నేషనల్ పీపుల్స్ పార్టీ ఆఫ్ మణిపూర్, హర్యానా జనహిత్ కాంగ్రెస్ ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఇంతకుముందు జారీ చేసిన రెండు నోటీసులకు పార్టీలు స్పందించకపోవడంతో ఇసి ఈ నిర్ణయం తీసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన రాజకీయ పార్టీలు 90 రోజుల్లోగా ఎన్నికల కమీషన్ కు ఖర్చులకు సంబంధించిన స్టేట్‌మెంట్లను దాఖలు చేయాలి. కానీ కొన్ని పార్టీలు మాత్రం ఇంకా లెక్కలు చూపని కారణంగా ఎన్నికల కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి ఎన్నికల కమీషన్ కు ఇప్పటికైనా ఆ పార్టీలు లెక్కల వివరాలు ఇస్తాయో లేదో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles