Telanagana tdp senior leader reventh reddy attacks on kcr ktr

reventhreddy, kcr, ktr, ttdp, trs, assembly, suspension, madhusudhanachary, harishrao

telanagana tdp senior leader reventh reddy attacks on kcr, ktr. reventh reddy attacks on kcr and ktr. ttdp mlas who suspended from telangana assembly wish to meets president and governor.

కెసిఆర్ కు నియంతలు.. కెటిఆర్ కు సమంతలు ఇష్టం

Posted: 03/17/2015 02:46 PM IST
Telanagana tdp senior leader reventh reddy attacks on kcr ktr

తెలుగుదేశం పార్టీ సినియర్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కెసిఆర్, కెటిఆర్ లపై మరోసారి మాటల తూటాలు  పేల్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై, ప్రభుత్వంపై ఆరోపణలు చెయ్యడంలొ తెలుగుదేశం పార్టీ నుండి రేవంత్ రెడ్డి ఎప్పుడూ ముందుంటారు. అసెంబ్లీలొ టిఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తూ, టిఆర్ఎస్ నేతలకు కోపం తెప్పిస్తుంటారు. అదే బాటలో తాజాగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఆయన కుమారుడు కెటిఆర్ లను ఉద్దేశించి కెసిఆర్ కు నియంతలంటే ఇష్టమని, కెటిఆర్ కు సమంతలంటే ఇష్టమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వైఖరిపై నిరసనకు దిగి అసెంబ్లీ నుండి సస్పెన్షన్ కు గురైన టిడిపి ఎమ్మెల్యేల బృందంలో రేవంత్ రెడ్డీ ఉన్నారు.

తెలంగాణ అసెంబ్లీ నుండి తమను సస్పెండ్ చెయ్యడం పై రాష్ట్రపతికి, గవర్నర్ కు ఫిర్యాదు చెయ్యనున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు.  అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారి కెసిఆర్, హరీష్ రావ్ ల ఆధ్వర్యంలొ పని చేస్తున్నట్లుందని రేవంత్ రెడ్డి తఆరోపించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మార్చినా వారిపై వేటు వెయ్యలేదని, కానీ ప్రశ్నించిన తమపై వేటు వేశారని అన్నారు. అందుకే తాము గవర్నర్, రాష్ట్రపతిని కలిసేందుకు నిర్ణయించుకున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : reventhreddy  kcr  ktr  ttdp  trs  assembly  suspension  madhusudhanachary  harishrao  

Other Articles