Students commence to rally for job notification from ou to gunpark

osmania university, students, unemployees, publice commission, telanagana, jobs, gun park, ncc gate, notification, police, rally

students commence to rally for job notification from ou to gunpark. in telanagana state unemployees and students expect jobs from new govt. but after one and half year there no even one notification from telanagana govt.

జాబులు.. జాబులన్నారు మరి నోటిఫికేషన్స్ ఎప్పుడు..?

Posted: 03/17/2015 01:30 PM IST
Students commence to rally for job notification from ou to gunpark

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని అనుకున్న నిరుద్యోగులకు నిరాశే మిగిలుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇంత కాలమైనా కనీసం ఒక్క నోటిఫికేషన్ కూడా రాకపోవడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే జాబ్ నోటిఫికేషన్ లను విడుదల చెయ్యాలంటూ ఉస్మానియా యూనివర్సిటి నుండి గన్ పార్క్ వరకు చేపట్టిన ర్యాలీ ఉద్రక్తతలకు దారీతీసింది. భారీగా చేరిన విద్యార్థులు ఓయు నుండి గన్ పార్క్ కు ర్యాలీగా బయలుదేరగా, ఎన్.సి.సి గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఓయులో ఉద్రక్తత నెలకొంది. తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకంగా వ్యవహరించిన విద్యార్థులు గత కొంత కాలంగా నోటిఫికేష్ల కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి నోటిఫికేషన్ జారీ చెయ్యలేదు. కొత్తగా పబ్లిక్ కమీషన్ ను ఏర్పాటు చేసి, పూర్తి స్థాయిలో ఉద్యోగాల నియామకాలను చేపడతామని కెసిఆర్ అంటున్నా, పబ్లిక్ సర్వీస్ కమీషన్ నుండి ఇప్పటి వరకు కొత్త నోటిఫికేషన్ ఊసెత్తడం లేదు. దాంతో గత కొంత కాలంగా నిరుద్యోగులు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఓయు విద్యార్థులు కెసిఆర్ ను కలిసినా, నోటిఫికేషన్ గురించి ఎలాంటి హామీ రాలేదు. దాంతో విద్యార్థులు ఆందోళన బాట పడుతున్నారు. టిపిఎస్సి ద్వారా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

-  అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles