Chandrababu said jagan mohanreddy supported to kcr

jagam, kcr, chandrababu, assembly, polavaram, pattisema

chandrababu said jagan mohanreddy supported to kcr. in ap assembly meeting ap cm chandrababu naidu attacked on ysrcp leader ys jagan on pattiseema and polavaram.

జగన్, చంద్రబాబు మధ్యలో కెసిఆర్

Posted: 03/17/2015 03:13 PM IST
Chandrababu said jagan mohanreddy supported to kcr

ఇదేంటి ఏదో సినిమా టైటిలా ఉంది అనుకుంటున్నారా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వేడివాడిగా సాగుతుంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో కీలకమైన ముగ్గురు వ్యక్తుల ప్రస్తావన వచ్చింది. చంద్రబాబు నాయుడు రాయలసీమకు నీటి కేటాయించడం గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని జగన్ ధ్వజమెత్తారు. పోలంవరం, పట్టిసీమలను చంద్రబాబు పూర్తిగా వదిలేశారని, రాజశేఖర్ రెడ్డి పోలవరాన్ని పూర్తి చెయ్యాలని అనుకున్నారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరం గురించి మరిచిపోయిందని అన్నారు. అయితే దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్ కు థీటైన సమాధానపమిచ్చారు. పోలవరాన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామని, ఎన్డీయే ప్రభుత్వం పోలవరాన్ని పూర్తి చేస్తుందని అన్నారు.

శ్రీశైలం రిజర్వాయర్ నుండి ఏపికి వచ్చే నీరు ప్రకాశం బ్యారేజ్ కు చేరుతుంది. అయితే ఆ నీటిలో కొంత భాగాన్ని రాయలసీమకు మళ్లించి, సీమ జిల్లాలకు నీటిని అందించేందుకు ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. కానీ తెలంగాణ సిఎం కెసిఆర్ మాత్రం శ్రీశైలం నీటిని మళ్లించాలన్నా, లేదా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమ అనుమతి కావాలంటూ పేచీ పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. తెలంగాణ సిఎం కెసిఆర్ వాదనను  జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నారని బాబు మండిపడ్డారు. రాయలసీమ జిల్లాలకు నీటిని అందించేందుకు ఎంతో కృషి చేస్తున్నామని , సీమ కు నీటి వసతి కలిగితే జగన్ ఆటలు సాగవని, అందుకే రాయలసీమకు నీరు రాకూడదని జగన్ కోరుకుంటున్నారని చంద్రబాబు వెల్లడించారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్, చంద్రబాబుల మధ్య జరుగతున్న చర్చలో కెసిఆర్ పేరు రావడం విశేషం.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jagam  kcr  chandrababu  assembly  polavaram  pattisema  

Other Articles