Supreme court turns down centreas decision to grant reservation to jats

supremecourt, jats, reservation, upa, obc, quota

The Supreme Court today quashed the Centre's decision to include Jats in the Other Backward Classes (OBC) category that made them eligible for reservations. The top court observed that the decision was based on decade-old data.

రిజర్వేషన్లకు కులం ఒక్కటే ఆధారం కాదు

Posted: 03/17/2015 12:41 PM IST
Supreme court turns down centreas decision to grant reservation to jats

రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించింది.  కులాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు కేటాయించడం కుదరదని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. జాట్  లకు ఒబిసి రిజర్వేషన్లు కల్పిస్తు గతంలో యుపిఎ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు తప్పుపట్టింది. కేవలం కులం ఆధారంగా వెనబడిన వారిగా గుర్తించడం తగదని, జాట్ లను ఒబిసి జాబితాలో చేరుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించింది. దాదాపు తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్న జాట్ వర్గాలకు మేలు చేసేలా అప్పటి యుపిఎ ప్రభుత్వం అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో జాట్ లను ఒబిసిలుగా గుర్తిస్తు జీవో జారి చేసింది.

జాట్ లను ఒబిసి జాబితాలో చేరుస్తూ అప్పటి యుపిఎ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఒబిసి రిజర్వేషన్ రక్షా సమితిసవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై స్పందించిన కోర్టు తాజాగా జాట్ లకు రిజర్వేషన్లను ఇవ్వడం కుదరదంటూ తీర్పునిచ్చింది. అయితే సుప్రీం కోర్టు తీర్పుపై ప్రభుత్వం నుండి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదు. రాజస్థాన్, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో మెజారిటీ కలిగిన జాట్ వర్గం వారు అక్కడి ప్రభుత్వ ఏర్పాటులో ఎంతో కీలకం. అయితే జాట్ ఓటు బ్యాంక్ ను దృష్టిలో పెట్టుకొని అప్పటి కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లను కల్పిస్తు నిర్ణయం తీసుకుంది. అయితే కేంద్రం కల్పిస్తున్న రిజర్వేషన్లలలో హేతుబద్దత లేదని కోర్టు తెలిపింది. కేవలం కులం మాత్రమే వెనబాటుతననానికి ప్రమాణం కాదని, రిజర్వేషన్లు కల్పించాలంటే సహేతుక కారణాలు ఉండాలని కోర్టు అభిప్రాయపడింది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : supremecourt  jats  reservation  upa  obc  quota  

Other Articles