Prisoners will give new look for nims soon

prisoners, telanagana, nims,

prisoners will give new look for nims soon. telanagana prisoners department implementing new system in the department. prisoners are took some schools to provide infrastucture, soon nims will get new look by prisoners work

నిమ్స్ ను చక్కదిద్దనున్న ఖైదీలు

Posted: 03/16/2015 09:27 AM IST
Prisoners will give new look for nims soon

గత కొంత కాలంగా సంస్కరణల బాటలో దూసుకెళ్తున్న తెలంగాణ రాష్ట్ర జైళ్లశాఖ మరో ప్రయోగానికి సిద్దమైంది. ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను స్వీకరించిన జైళ్లశాఖ, తాజాగా నిమ్స్ ఆసుపత్రి నిర్వహణ పనుల బాధ్యతను స్వీకరించేందుకు సన్నద్ధమయ్యారు. నిజాం కాలంనాటి నిమ్స్ ఆసుపత్రి భవనాల మరమ్మతులు, పెయింటింగ్, ప్లంబర్స్, కార్పెంటింగ్ పనుల నిర్వహణ బాధ్యతను తీసుకునేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్ర జైళ్లలోని ఆయా రంగాల్లో నైపుణ్యం కలిగిన సుమారు 500 మంది ఖైదీలను జైళ్ల శాఖ ఇప్పటికే గుర్తించింది. వారి ద్వారానే సంగారెడ్డి జైలులో ఏర్పాటు చేస్తున్న మ్యూజియానికి సంబంధించిన నిర్మాణ, మరమ్మతు బాధ్యతల చేయించారు. పనుల ఆధారంగా అందులో నుంచి 25 మంది నైపుణ్యం కలిగిన ఖైదీలను గుర్తించారు. తాజాగా వారితో చంచల్‌గూడ కేంద్ర కారాగారంతోపాటు అందులోని మహిళల జైలుకు మరమ్మతులు, పెయింటింగ్ చేయించారు.

ఇలా జైళ్ల శాఖ రాష్ట్ర జైళ్లలోని సత్ ప్రవర్తనతోపాటు ఏదేని రంగంలోని నైపుణ్యం కలిగి ఉన్న ఖైదీలను గుర్తిస్తోంది. వారి నైపుణ్యాన్ని ఉపయోగించుకునేలా కార్యాచరణ రూపొందిస్తోంది. తెలంగాణ జైళ్ల శాఖలో సంస్కరణల గురించి తెలుసుకున్న నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఎల్ నరేంథ్రనాధ్ ఆసుపత్రి మరమ్మతు నిర్వహణల బాధ్యతను స్వీకరించాలని కోరుతూ డిజి వికె సింగ్‌కు ప్రతిపాదనలు పంపారు. అందుకు డిజి వికె సింగ్ సానుకూలంగా స్పందించారు. ఖైదీల ద్వారా నిమ్స్‌లో భవనాల మరమ్మతులు, ప్లంబింగ్, పెయింటింగ్, కార్పేంటర్ వంటి పనులు నిర్వహించేందుకు అంగీకరించారు. కాగా ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉంటుంది. దీంతో అనుమతులు కోరుతూ డిజి వికె సింగ్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జైళ్ల శాఖ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే నిమ్స్ నిర్వహణ పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఖైదీలు ఆస్పత్రికి కొత్త రూపురేఖలు తెస్తారని జైళ్ల శాఖ గట్టి నమ్మకంతో ఉంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prisoners  telanagana  nims  

Other Articles