Apj abdul kalam call the children to achive their dreams

apj abdulkalam, kalam, students, dreams

apj abdul kalam call the children to achive their dreams. kalam participated in a school programmee at guntur. he said that every children must dream and try to achive that dreams.

కలల్ని సాకారం చేసుకోండి: అబ్దుల్ కలాం

Posted: 03/16/2015 09:39 AM IST
Apj abdul kalam call the children to achive their dreams

తల్లిదండ్రుల ఆశయాలను సాకారం చేసుకోడానికి శక్తివంచన లేకుండా శ్రమిస్తే, అవి నిజమవుతాయని మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎపిజె అబ్దుల్‌కలామ్ స్పష్టం చేశారు.  గుంటూరు సమీపంలోని చౌడవరంలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వరా బాలకుటీర్ స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాలబాలికలు చిన్నప్పటి నుంచే మంచి కలలు కనాలన్నారు. కలలు కనడమొక్కటే కాదు ఆ కలలను సాకారం చేసుకోవాలంటే మంచి ప్రణాళిక, క్రమశిక్షణాయుతమైన జీవన విధానం ఎంతో అవసరమన్నారు. ఈ దిశగా విద్యార్థినీ, విద్యార్థులను నడిపించే బాధ్యత తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులపై కూడా ఉందని ఆయన గుర్తు చేశారు. ఎన్నో సమస్యలు ఎదురవుతాయని, అనేక విషయాల్లో మనకు మనం సమస్య కాకూడదని, అనుకున్న లక్ష్యం సాధించడంలో ఆ సమస్యలే మనల్ని చూసి భయపడాలని కలామ్ సూచించారు.

ప్రపంచంలో శాస్త్ర, సాంకేతికపరంగా ఎన్నో ఘన విజయాలు సాధించడానికి మూల స్తంభాలైన ఐదుగురు ప్రసిద్ధ శాస్తవ్రేత్తల పేర్లు, వారు సాధించిన విజయాలను కలామ్ ఈ సందర్భంగా ప్రధానంగా ప్రస్తావించారు. థామస్ ఎడిసన్, అలెగ్జాండర్ గ్రాహంబెల్, రెండుసార్లు నోబెల్ బహుమతి అందుకున్న మేడమ్‌క్యూరీ, రైట్ బ్రదర్స్, సర్ సివి రామన్ చేసిన కృషిని ఎంతగానో కొనియాడారు. వీరందరినీ స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు భవిష్యత్తులో తాము ఎంచుకున్న రంగాల్లో పరిణతి చెందిన ప్రతిభామూర్తులుగా తయారుకావాలని, తద్వారా తల్లిదండ్రులకు, సమాజానికి, దేశానికి కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెట్టాలని కోరారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : apj abdulkalam  kalam  students  dreams  

Other Articles