Central minister appricate the family of manikanta who gave his organs

venkiahnaidu, manikanta, organ, transplantation, modi

central minister appricate the family of manikanta who gave his organs. venkiahnaidu said that manikankta and his family done great sacrifice with donating manikantas organs. he said that he notice the issue of manikanta to pm modi.

మణికంఠ త్యాగం చరిత్రలో నిలుస్తుంది: వెంకయ్యనాయుడు

Posted: 03/16/2015 09:11 AM IST
Central minister appricate the family of manikanta who gave his organs

అవయవ దానం చేసి దేశంలోని అన్ని ప్రాంతాల వారికి ఆదర్శంగా మణికంఠ కుటుంబ సభ్యులు చేసిన త్యాగం చరిత్రలో నిలచిపోతుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.  అఖిల భారత విద్యార్థి పరిషత్  ఆధ్వర్యంలో అవయవ దానంపై గుంటూరు ఎన్టీఆర్ స్టేడియం నుంచి మాజేటి గురవయ్య స్కూలు వరకు నిర్వహించిన 2కె వాక్, అవగాహన ర్యాలీని వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు మణికంఠ తల్లి రాధమ్మ, సోదరి శివనాగజ్యోతిని సత్కరించారు.మణికంఠ కుటుంబ సభ్యులు చేసిన త్యాగాన్ని ప్రధాని నరేంద్రమోడీ దృష్టికి తీసుకెళ్తానని వెంకయ్యనాయుడు అన్నారు. పొరుగువారికి సాయపడాలన్న భావన భారత సంస్కృతి అంతర్భాగమైనప్పటికీ మణికంఠ కుటుంబ సభ్యులు చేసిన సాయం వెలకట్టలేనిదని వెంకయ్యనాయుడు కొనియాడారు. దీనిని నేటితరం స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. దేశం గర్వపడే మంచిపనిని మణికంఠ కుటుంబం చేసిందని కొనియాడారు. ఎబివిపి జాతీయ కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ భారతదేశానికి రోల్ మోడల్‌గా మహిళలను పేర్కొనాల్సి వస్తే మణికంఠ తల్లి, సోదరిని పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ఒక మహిళ తాను తలచుకుంటే ఎంత కష్టాన్నయినా ఎలా భరించగలదో మణికంఠ తల్లి, సోదరి నిరూపించారన్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : venkiahnaidu  manikanta  organ  transplantation  modi  

Other Articles