Ap agriculture minister pratipati pullarao will submit agriculture budget in assembly today

ap, agriculture, agriculturebudget, budget, pattipatipullarao, farmers, crop loans

ap agriculture minister pratipati pullarao will submit agriculture budget in assembly today.may agriculture budget have fifteen thousand crores.

నేడే ఏపి వ్యవసాయ బడ్జెట్

Posted: 03/13/2015 09:15 AM IST
Ap agriculture minister pratipati pullarao will submit agriculture budget in assembly today

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలొ నేడు వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. గత ఏడాదికంటే బడ్జెట్‌లో కేటాయింపులు ఈసారి పెరిగినట్లు సమాచారం. గత ఏడాది 7వేల కోట్లు వ్యవసాయానికి, ఐదు వేల కోట్లు రుణమాఫీకి, మరో 500 కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్‌కు చేర్చిన ప్రభుత్వం ఈసారి మొత్తం వ్యవసాయ బడ్జెట్‌ను 15వేల కోట్ల మేర చూపించినున్నట్టు తెలిసింది. ఇందులో 4660 కోట్లు రుణమాఫీకి బడ్జెట్‌లో చూపిస్తున్నట్టు తెలిసింది.

మొత్తం మీద చూస్తే వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు పెంచేలా బడ్జెట్‌ను రూపొందించినట్టు వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గి, దిగుబడి పెంచేలా ప్రోత్సహిస్తామని అన్నారు. రైతులకు ఏడు గంటల ఉచిత విద్యుత్‌ను అందజేస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై కూడా దృష్టికేంద్రీకరించామని చెప్పారు. పాల ఉత్పత్తి, మత్స్య సంపద ఉత్పత్తి పెంచేందుకు ప్రోత్సాహకాలను అందిస్తామని కూడా ఆయన వివరించారు. మరి నిన్న సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏపి ప్రభుత్వం, వ్యవసాయ బడ్జెట్ ను ఎలా రూపొందించిందో కొద్ది సేపటికి తేలనుంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap  agriculture  agriculturebudget  budget  pattipatipullarao  farmers  crop loans  

Other Articles