Rahul gandhi need some more time for rest congress leaders clear this

rahul gandhi, leave, parliament, aicc, delhi

rahul gandhi need some more time for rest congress leaders clear this. aicc vice president rahul gandhi took leave on parliament bidget sessions. he need some more rest the congress seniors said this.

రాహుల్ కు ఇంకా సెలవు కావాలట..!

Posted: 03/13/2015 09:03 AM IST
Rahul gandhi need some more time for rest congress leaders clear this

కాంగ్రెస్ భవిష్యత్ ఆశాకిరణం రాహుల్ గాంధీ సెలవంటూ వెళ్లి పోవడం అన్ని రాజకీయ పార్టీల్లో చర్చకు దారితీసింది. అయితే రాహుల్ ఎక్కడికి వెళ్లారు ఎప్పుడు వస్తారు అని ఎవరూ స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. దేశ భవిష్యత్తులో ఎంతో కీలకమైన బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాహుల్ పలాయనం సర్వత్రా ఆసక్తిని రేపింది. అయితే ఢిల్లీలో జరనున్న ఏఐసిసి సమావేశానికి రాహుల్ బాబు తన తరహా పథక రచన చేస్తున్నారని, అందుకే ఆయన సెలవుపై కొంత కాలం వెళ్లారని కొందరు కాంగ్రెస్ నాయకులు వెనకేసుకొచ్చారు.

తాజాగా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరింత కాలం విశ్రాంతి కోరుకుంటున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అందుకోసం సెలవును మరింత పొడగించుకున్నట్లు స్పష్టం చేశాయి. మంగళవారమే రాహుల్‌ ఢిల్లీకి రావాల్సి ఉన్నప్పటికీ ఇతర కారణాల వల్ల ఈ వారాంతానికల్లా వచ్చే అవకాశం లేదని ఆయన సన్నిహిత నేతలు తెలిపారు. రాహుల్‌ ముందు పెట్టుకున్న సెలవు ఈ వారాంతానికి ముగుస్తోంది. ఈ సెలవును పెంచుకోవటంతో.. కేంద్రం తీసుకువచ్చిన భూ సేకరణ బిల్లుపై విపక్షాలు 17వ తేదీన తలపెట్టిన రాష్ట్రపతి భవన్‌కు పాదయాత్రలో రాహుల్‌ గాంధీ పాల్గొనటం లేదు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలకు హాజరు కావటం లేదని సెలవు పెట్టుకున్నారు. ఇప్పుడు అదే సెలవును పొడగించుకున్నారు. రాహుల్‌ గాంధీ ఆత్మపరిశీలన చేసుకుని.. సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు విదేశాలకు వెళ్లారని కాంగ్రెస్‌ పార్టీ నేతలు తెలిపారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi  leave  parliament  aicc  delhi  

Other Articles