Amid massive protests inside and outside the kerala assembly

kerala, assembly, km mani, omen chandi, bar licence, protest

Amid massive protests inside and outside the Kerala assembly, Finance minister KM Mani read out the state budget at top speed this morning, surrounded by marshals to prevent opposition leaders from heckling him.

కేరళ అసెంబ్లీలో గందరగోళం.. ఉద్రిక్తత

Posted: 03/13/2015 09:53 AM IST
Amid massive protests inside and outside the kerala assembly

కేరళ అసెంబ్లీలో, బయట యుద్ద వాతావరణం నెలకొంది. నేడు కేరళ ఆర్థిక మంత్రి కె.యం మణి 13వ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో బిజెపి కార్యకర్తలు, ప్రతిపక్షనాయకులు పెద్ద సంఖ్యలో అసెంబ్లీ వద్ద గుమిగూడారు. వారు కె.యం మణికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి వీలు లేదని కోరుతున్నారు. అయితే కె.యం మణి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తాను బడ్జెట్ ను ప్రవేశపెడతానని ప్రకటించారు. దాంతో వేలాదిగా తరలివచ్చిన ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, బిజెపి నాయకులతో అసెంబ్లీ బయట యుద్ద వాతావరణం నెలకొంది. ప్రతిపక్ష నాయకులు ఆర్థిక మంత్రి లోపలికి రాకుండా అసెంబ్లీ అన్ని తలుపులను మూసి వేశారు. అయితే అసెంబ్లీ వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో దాదాపుగా మూడు వేల మంది పోలీసులు అక్కడికి చేరి, పరిస్థితిని అదుపు చెయ్యడానికి ప్రయత్నించారు.

ఇంత ఉద్రక్తత నెలకొన్నా, కేరళ ఆర్థిక మంత్రి కె.యం. మణి మాత్రం తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీకి రాకుండా అడ్డుపడ్డా, పోలీసుల సహాయంతో ఆయన అసెంబ్లీలోకి చేరుకున్నారు. అయితే అసెంబ్లీలో ప్రతిపక్షాలు కె.యం. మణిని అడ్డగించకుండా, స్వంత పార్టీ ఎమ్మెల్యేలు రక్షణగా నిలువగా, మంత్రి తన ఆర్థిక బడ్జెట్ కు సంబందించిన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. కాగా కేరళలో బార్ ల లైసెన్స్ లను పునరుద్దరించడానికి ఆర్థిక మంత్రి కోటి రూపాయలు లంచం తీసుకున్నారని ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kerala  assembly  km mani  omen chandi  bar licence  protest  

Other Articles