Telanagana cm kcr grandly launched the mission kakatiya in nizamabad

mission kakatiya, kcr, harishrao, nizambad

telanagana cm kcr grandly launched the mission kakatiya in nizamabad. kakatiya mission pilon inaugrated by the telanagana cm kcr at sadashivapet of nizamabad dist.

తట్టెత్తుదాం.. చెరువు తవ్వుదాం: కెసిఆర్

Posted: 03/13/2015 08:59 AM IST
Telanagana cm kcr grandly launched the mission kakatiya in nizamabad

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ నిజామాబాద్‌ జిల్లా సదాశివనగర్‌ మండల కేంద్రంలోని పాత చెరువులో అధికారికంగా ప్రారంభించారు. స్వయంగా తానే మట్టిన తవ్వి, తట్టలో పోశారు. మిషన్‌ కాకతీయ పవిత్ర యజ్ఞంమని,  గ్రామాలకు చెరువులు గుండెకాయ వంటివని కెసిఆర్ వివరించారు. చెరువు నిండితేనే రైతు బాగుంటాడు. చెరువుల పునరుద్ధరణ పనుల్లో ఎవరు అక్రమాలకు పాల్పడినా సహించేది లేదని హెచ్చరించారు. నాణ్యత లేకుండా పనులు చేసే వారిని జైలుకు పంపిస్తానని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.  మిషన్‌ కాకతీయ పైలాన్‌ను ఆవిష్కరించారు.

ఉద్యమ స్ఫూర్తితో పనులు పూర్తిచేస్తామని, రాష్ట్ర ప్రజలందరూ వీటిలో పాల్గొనాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో మొండి ధైర్యంతో ముందుకు పోయామని. చావు వరకూ వెళ్లి రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని. ఆ విధంగానే ప్రస్తుతం మిషన్‌ కాకతీయ పనులు పూర్తిచేసి చూపెట్టాలి అని ఆకాంక్షించారు. మిషన్‌ కాకతీయ పనులు బాగా పూర్తిచేశారని దేశంలో పేరు తెచ్చుకోవాలని అబిలషించారు. చెరువు పనులలో నాణ్యత ఉండే విధంగా ఆయా గ్రామాల ప్రజలు చూసుకోవాలని. కాంట్రాక్టు ఒకరు పొంది.. పనులు మరొకరితో చేయించే దొంగ కాంట్రాక్టర్లను తరిమికొట్టండి అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ హయాంలో నాణ్యత లేకుండా చెరువుల పనులు జరిగాయన్న కేసీఆర్‌... అలాంటి పనులు చేసిన కాంట్రాక్టర్లను గుర్తించి బ్లాక్‌ లిస్టులో పెట్టాలని ఆయన ఆదేశించారు. మిషన్‌ కాకతీయ పనులు మొదలుకాకముందే కాంగ్రెస్‌ పార్టీ నేతలు బూజుపట్టిన సిద్ధాంతాలతో ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. కాంట్రాక్టర్లంతా ఓపెన్‌ టెండర్లలోనే పాల్గొంటున్నారని, ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా టెండర్లను కేటాయిస్తున్నామన్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mission kakatiya  kcr  harishrao  nizambad  

Other Articles