Ap and ts plolice fight for sagar

nagarjuna sagar, ts and ap police fight, sagar issue, irrigation water

ap and ts plolice fight for sagar : on irrigation water of nagarjunasagar is going very comlecated. ap officials tried to release the water ts officials oppose and stop that. ap cm chandrababu naidu make a call to kcr and appointment at governor to discuss the sagar issue

లాఠీలు ఝులిపించుకున్న పోలీసులు..ముదిరిన సాగర్ వివాదం

Posted: 02/14/2015 08:52 AM IST
Ap and ts plolice fight for sagar

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం చిలిచిలికి గాలి వానగా మారుతోంది. నాగార్జున సాగర్ నీటిని విడుదల చెయ్యడానికి వచ్చిన ఆంధకనప్రదేశ్ నీటి పారుదల అధికారులు రావడం, వారిని తెలంగాణ అధికారులు అడ్డుకోవడంతో ఉద్రక్తత నెలకొంది. అటు గుంటూర్, నల్గొండ జిల్లాలకు చెందిన పోలీసులు సాగర్ వద్దకు చేరుకున్నారు. అధికారులు వాగ్వాదానికి దిగగానే, వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. పోలీసులు తమ లాఠీలను ఝులిపించుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పోలీసులు ఒకరిపై మరొకరు ప్రతాపాన్ని చూపించుకున్నారు. దాంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. అయితే రెండు రాష్ట్రాలకు చెందిన నాయకులకు అధికారులు ఫోన్లు చేశారు. ఏపి సిఎం చంద్రబాబు తెలంగాణ సిఎం కెసిఆర్ కు ఫోన్ చేశారు. సాగర్ వివాదంపై గవర్నర్ తో భేటి అవుదామని ఇద్దరు ముఖ్యమంత్రులు ఓ ఒప్పందానికి వచ్చారు. దాంతో అధికారులు శాంతించారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే గవర్నర్ భేటిలో ఏ నిర్ణయం తీసుకుంటారో అని అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణకు చెందిన అధికారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరోపక్క కృష్ణా నీటి యాజమాన్య బోర్డ్ వైఖరి రెండు రాష్ట్రాల మధ్య మరింత వివాదాలకు చోటిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ కోరిన విధంగా కుడి కాలువ ఆయకట్టుకు నీటిని విడుదల చెయ్యాలని సూచించినట్లు కృష్ణా నదీజలాల యాజమాన్య బోర్డ్ తెలిపింది. కానీ తెలంగాణ అధికారులు మాత్రం తమకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదని వాదిస్తున్నారు. ఈ వివాదంపై నిజానిజాలను కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖకు నివేదించినట్లు బోర్డు తెలిపింది. రెండు రాష్ట్రాలు తాము అడిగిన సమాచారాన్ని ఇవ్వడం లేదని ఆరోపించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nagarjuna sagar  ts and ap police fight  sagar issue  irrigation water  

Other Articles