Ukrain rebals commence to stop the war

ukrain, russia, ukrain rebals, ukrain war, war in ukrain

ukrain rebals commence to stop the war : in the discussions russia and ukrain, ukrain rebals to stop the war. russia president puthin declare special status to ukrain region.

ఉక్రెయిన్ లో కాల్పుల విరమణ...పాటించడంపైనే అనుమానాలు

Posted: 02/13/2015 11:02 AM IST
Ukrain rebals commence to stop the war

ఉక్రెయిన్..గత కొంత కాలంగా యుద్దంతో అట్టుడుకుతున్న ప్రాంతం. రష్యా నుండి విడిపోవాలని నిర్ణయించుకున్న కొందరు వేర్పాటువాదులు ప్రారంభించిన  ఉద్యమం హింసాత్మకంగా మారింది. సాధారణ పౌరులను ఇందులోకి భాగస్వాములను చేసింది. అయితే ఉక్రెయిన్ వివాదంపై రష్యా ఘాటుగా స్పందించింది. దాంతో ఎఉక్రెయిన్ లో యుద్దం సద్దుమనగడం లేదు. మరో పక్క రష్యా వైఖరిపై అగ్రరాజ్యం అమెరికా గుర్రుగా ఉంది. ఉక్రెయిన్ లో మానవ హక్కుల ఉల్లఘన జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే అమెరికా జోక్యాన్ని రష్యా వ్యతిరేకించింది.

నిత్యం హింసతో అట్టుడుకుతున్న తూర్పు ఉక్రెయిన్‌ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి తొలి అడుగు పడింది. జర్మనీ, ఫ్రాన్స్‌, రష్యా, ఉక్రెయిన్‌ దేశాధినేతలు సుమారు 16 గంటలు చర్చలు జరిపి ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పడానికి ఓ ఒప్పందాన్ని ఆమోదించారు. ఉక్రెయిన్‌, రష్యా మద్దతు ఉన్న తిరుగుబాటు దళాలు ఆదివారం నుంచి కాల్పుల విరమణ పాటించాలని తీర్మానించారు. ఈ శాంతి ఒప్పందం ఎంతవరకు నిలుస్తుందనే సందేహాలు తలెత్తుతున్నాయి. తిరుగుబాటు దారులు ఉన్న ప్రాంతాలకు ప్రత్యేక హోదా కల్పించాలని  అంగీకారానికి వచ్చినట్లు రష్యా అధ్యక్షుడు  పుతిన్‌ ప్రకటించారు.  చర్చలు జరుగుతున్న సమయంలోనే  ఉక్రెయిన్‌ దళాలకు తిరుగుబాటుదారులకు మధ్య కాల్పులు జరిగాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ukrain  russia  ukrain rebals  ukrain war  war in ukrain  

Other Articles