Central govt decided to remove toll plazas

nithin gadkari, central transport minister, transport updates, toll plazas, toll charges

central govt. decided to 125 toll plazas. the govt decided to remove total 125 toll plaza across the india. under 60 cr. invested plaxas are also will remove the toll.

టోల్ భారం తగ్గుతోందోచ్.....

Posted: 02/13/2015 10:33 AM IST
Central govt decided to remove toll plazas

సగటు జనానికి భారంగా మారింది టోల్. నేషనల్ హైవేల నిర్వహణ బాధ్యత పేరుతో నేషనల్ హైవే అథారిటి తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలకు ప్రయాణ బారాన్ని పెంచింది. ప్రజలపై ప్రయాణ భారాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆ దిశగా నేషనల్ హైవేలపై 125 టోల్ ప్లాజాలను ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించింది.  65 రోడ్ ప్రాజెక్టుల్లో టోల్ వసూల్ ను గతంలోనే నిలిపి వేసినట్లు కేంద్ర రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరి ప్రకటించారు.

50 కోట్ల కన్నా తక్కువ పెట్టుబడితో ప్రారంభమైన అన్ని రోడ్ ప్రాజెక్టులపై టోల్ ను ఎత్తివేయాలని నిర్ణయించినట్లు నితిన్ వెల్లడించారు. మరో పక్క టోల్ గేట్ల వద్ద వాహనాల వెయిటింగ్ కారణంగా చాలా సార్లు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఐఐఎం రిపోర్ట్ ను మంత్రి వివరించారు. వివధ చెక్ పోస్టుల వద్ద జాప్యం వల్ల 66 వేల కోట్లు నష్టం కలుగుతోందని అన్నారు. ముంబై-ఢిల్లీ ల మధ్య 350 టోల్ పాయింట్ లలో 140 ని ఇ-టోల్ పాయింట్ లుగా మారుస్తామని తెలిపారు. కొత్తగా ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెని లిమిటెడ్ పేరుతో ఓ కొత్త కంపెనీని ప్రారంభించి, ఇ-టోల్ బాధ్యతను అప్పగిస్తామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nithin gadkari  central transport minister  transport updates  toll plazas  toll charges  

Other Articles