Mrps clears about fire on tdp meeting spot

chandrababau telangana yatra, mrps, mrps clears about fire on tdp meeting spot, babu tour, babu warangal tour, ap cm chandra babu, ncbn telangana tour, ttdp, Chandrababu telangana tour, ap cm chandrababu telangana yatra, fire at warangal tdp stage,

mrps declares themselves responsible for firing tdp stage at warangal,

‘బోడ మల్లన్న’ తీరును వ్యతిరేకిస్తూ వేదికను తగులబెట్టాం...

Posted: 02/12/2015 02:02 PM IST
Mrps clears about fire on tdp meeting spot

వరంగల్ జిల్లాలో టీడీపీ సభా వేదికకు నిప్పు పెట్టింది తామేనంటూ ఎమ్మార్పీఎస్ గురువారం స్పష్టం చేసింది. అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు తమను బోడ మల్లన్న అన్న రీతిగా పరిగణించడంతోనే తాము ఈ చర్యకు పాల్పడినట్లు ఎమ్మార్పీఎస్ స్పష్టం చేసింది. ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో తమను రక్షణ కవచంగా వాడుకుని...ఇప్పుడు వర్గీకరణ విషయంలో చంద్రబాబు ఓడ మల్లన్న పాట ఆలపిస్తున్నారని ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు మండిపడ్డారు. చంద్రబాబు వరంగల్ చేరేలోపు సంచలనం రేపుతామని వారు హెచ్చరించారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు వరంగల్‌ జిల్లా పర్యటనకు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అడుగడుగునా అడ్డుపడుతున్నారు. పలుచోట్ల టీడీపీ జెండాలు తగలబెట్టారు. వరంగల్ జిల్లా టీడీపీ కార్యాలయంపై కార్యకర్తలు దాడి చేసి నిప్పు పెట్టేందుకు యత్నించారు. కాగా అంతకు ముందు హన్మకొండ బస్టాండ్ సమీపంలోని హయగ్రీవాచారి మైదానంలో టీడీపీ సభ నిర్వహించడానికి ఏర్పాటు చేసిన వేదికకు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నిప్పుపెట్టారు. దీంతో వేదిక వెనుక భాగం దగ్ధమైంది. మంటల్లో బ్యానర్లు, ప్లెక్సీలు, జెండాలు, ఫర్నిచర్ దగ్ధమయ్యాయి.  ఈ నేపథ్యంలో ఎంఆర్‌పీఎస్‌ కార్యకర్తలను టీడీపీ కార్యకర్తలు చితక్కొట్టారు. అయితే శాంతి భద్రతలను పర్యవేక్షించాల్సిన పోలీసులు వారిని విడదీయాల్సింది పోయి వేడుక చూడటం గమనార్హం.
 

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  Hayagrivacari field  Chandrababu  

Other Articles