Propables for kejriwal cabinet sisosia to get deputy cm

Delhi Cabinet, Delhi government 2015, Delhi Decide, Kejri Team, Somnath Bharti and Rakhi Birla, Rakhi Birla, Ram Nivas Goyal, Adarsh Shastri, who is Adarsh Shastri, Manish Sisodia, Probables for Kejri Cabinet, AAP, Manish Sisodia, deputy chief minister of Delhi,

CM designate Arvind Kejriwal likely to induct Manish Sisodia as his deputy, and he may take full-fledged cabinet on February 14, the day he takes oath.

సిసోడియాకు డిప్యూటీ సీఎం..! ప్రతిపాదిత మంత్రిమండలి ఇదే..

Posted: 02/12/2015 02:04 PM IST
Propables for kejriwal cabinet sisosia to get deputy cm

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తనకంటూ వున్న ప్రత్యేకతను చాటుకోవడంలో ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ మానియాను ఎదుర్కొన్ని ఢిల్లీ పీఠాన్ని 67 అసెంబ్లీ స్థానాలతో కైవసం చేసుకున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందే, పాలనా పగ్గాలను చేపట్టక ముందే కేంద్ర మంత్రులను కలసి ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను కల్పించాలని, ఢిల్లీలో అనధికారికంగా వుంటున్న మురికివాడల ప్రజలను క్రమబద్దీకరించాలని ఆయన కోరారు.

కాగా మంత్రివర్గం కూర్పులోనూ తానకెవరూ సాటిలేరని నిరూపించుకునేందుక కేజ్రీవాల్ సరికొత్తగా మంత్రిమండలి కూరుస్తున్నట్లు సమాచారం. బీజేపి పార్టీ సీనియర్ అద్వానీని మంత్రి మండలిలో పక్కన బెట్టగా, అప్ తమ సీనియర్ నేత మనీష్ సిసోడియాకు కేజ్రీవాల్ కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ.. తాజా ఎన్నికల్లో ఆప్ గెలుపునకు కృషి చేసిన ఆయనకు డిప్యూటీ ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. అరవింద్ కేజ్రీవాల్తో కలిపి 11 మందితో కేబినెట్ ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది.  ప్రస్తుతం కేబినెట్లో ఎవరెవరు ఉంటారనే దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది.

కొత్తగా ఏర్పడే కేబినెట్లో పాత మంత్రులు ముగ్గురికి చోటు లభించే అవకాశం ఉంది. సత్యేంద్ర జైన్, సౌరభ్ భరద్వాజ్ తిరిగి కేబినెట్లోకి వచ్చే అవకాశం ఉంది మొత్తానికి కేజ్రీ క్యాబినెట్ లో మనీష్ సిసోడియా, సత్యంద్ర జైన్, ఆదర్శ్ శాస్త్రీ, సురబ్ భరద్వాజ్, జితేందర్ తోమర్, కపిల్ మిశ్రా, సందీప్ కుమార్, అసిం అహ్మద్ ఖాన్ లకు మాత్రమే మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని ప్రచారం జరుగుతోంది. పలు ఆరోపణలు ఎదుర్కోంటున్న . రాఖీ బిద్లాన్లు, గిరీశ్ సోనీ, సోమ్నాథ్ భారతీలకు కేబినెట్లో చోటు దక్కకపోవచ్చునని భావిస్తున్నారు. అప్ తరపున డిమోలీ నియోజకవర్గం నుంచి గెలిచిని అత్యంత పిన్న వయస్కుడు 26 ఏళ్ల ప్రకాష్ జర్వాల్ సహా, పటేల్ నగర్ నియోజకవర్గం నుంచి గెలిచిన అత్యంత పెద్ద వయస్కుడు హజారా లాల్ చౌహాన్ లకు కేజ్రీ క్యాబినెట్ లో స్థానం లభించకపోవచ్చునని తెలుస్తోంది.

కాగా అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం సహా 11 మంది మంత్రల ప్రమాణస్వీకారానికి రాంలీలా మైదానంలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. సరిగ్గా గత ఏడాది అదే రోజున జన్ లోక్ పాల్ బిల్లు అమోదించకపోవడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన కడిగిన ముత్యంలా ఢిల్లీ ప్రజల పూర్తి అమోదంతో పాలన పగ్గాలను చేపట్టనున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi Cabinet  Delhi government 2015  Delhi Decide  Kejri Team  Manish Sisodia  

Other Articles