Jc on congress

jc divakar reddy, jc on congress, jc comments, jc on ysrcp, jc comments on rahul gandhi, jc on sonia

jc on congress. he said that there is no gandhis in congress. congress will be in form when rahul and sonia will come out from congress.ysr cp dont have leaders in their party.

కాంగ్రెస్ లో అసలు గాంధీలే లేరు : జె.సి. దివాకర్ రెడ్డి

Posted: 02/12/2015 01:35 PM IST
Jc on congress

కాంగ్రెస్ పార్టీ పై మాజీ మంత్రి, ప్రస్తుత టిడిపి నేత జె.సి. దివాకర్ రెడ్డి విమర్శలు కురిపించారు. కాంగ్రెస్ పార్టీలో అసలు గాంధీలు లేరని, అరువు గాంధీలే ఉన్నారని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కొడుకు ఏఐసిసి ఉపాధ్యక్షుడైన  రాహుల్ గాంధీపైనా విమర్శలు చేశారు. వారిద్దరు పార్టీ నుండి వెళ్లిపోతేనే కాంగ్రెస్ పార్టీకి మంచి జరుగుతుందని అన్నారు. పనిలో పనిగా వైఎస్సార్ కాంగ్రెస్ పైనా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఆ పార్టీకి నాయకుల్లేరని, నాయకుల్లేని పార్టీ ప్రజలకు ఏం చేస్తుందని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన జెసి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles