Net users comment on delhi elections

comments in net, commnt in social media, social media, twitter on kejriwal, polling online

net users comment on delhi elections : on the delhi result many tweet and comments to greet aap and comments on bjp and congress.

బిజెపి, కాంగ్రెస్ లకు నెటిజన్ల పంచ్ లు...ఆప్ కు గ్రీటింగ్స్

Posted: 02/11/2015 02:56 PM IST
Net users comment on delhi elections

ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై సోషల్ మీడియాలో ట్వీట్ల మోత మోగింది. అన్ని రకాల సోషల్ మీడియాల్లోనూ నెటిజన్లు బీజెపి, కాంగ్రెస్ లకు చురకలెట్టారు. ముందు నుండి సోషల్ మీడియాకు కాస్త దగ్గరగా ఉండే ఆప్, బిజెపిల మధ్య యుద్దానికి సోషల్ సైట్లు వేదికలయ్యాయి. గతంలో మాదిరిగా ఏదో అంశాన్ని కాకుండా ప్రతి అంశంపైనా సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో సోషల్ మిడియాను బాగా వాడిన భాజపాకు ఢిల్లీ ఎన్నికల్లో మాత్రం కలిసి రాలేదు. ఢిల్లీ యువతలో చాలా మంది ఆప్ అభిమానులు, సానుభూతిపులు ఉండటంతో భాజపాకు గట్టిదెబ్బ తగిలింది. ఎన్నికల ఫలితాలు వెల్లడి తర్వాత సోషల్ మీడియాలో కామెంట్ల సంఖ్య భారీగా పెరిగింది. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న కొన్ని ట్వీట్లు, కామెంట్లు...


-కేజ్రీవాల్ మోసం చేశాడు, చీపురు పేరు చెప్పి వ్యాక్యుమ్ క్లీనర్ తో జుర్రేశాడు

-రాహుల్ గాంధీని రాజీనామా చెయ్యాల్సిందే నని ఎందుకు అడుగుతారు. ఎవరైనా రాజకీయాలకు జీవితంలో ఎన్ని సార్లు రాజీనామా చేస్తారు రాహుల్ గాంధీ రాజీనామా లేఖలు రాయడం మొదలుపెడితే ఎన్ని లేఖలు రాయాలో

-67-3 ఇదేదో క్రికెట్ స్కోర్ లా ఉంది

-కాంగ్రెస్ పార్టీ తన మస్కట్ గా ఆర్యభట్టను పెట్టుకుంటే మంచిది ఎందుకంటే సున్నాను కనిపెట్టింది అతనే కదా

-నా దగ్గర మూడు సీట్లున్నాయని మోదీ కేజ్రీవాల్ కు చెబితే, కేజ్రీవాల్ వాటిని ఓఎల్ఎక్స్ లో పెట్టెయ్ అన్న

కామెంట్ ఫేస్ బుక్ లో తెగ హల్ చల్ చేస్తోంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles