Telangana and andhra governments are more interested in buying cars than development

ap police, ts police, new cars in ts govt, renovations in ts police, new cars for ap police, new police cars launched by cm

ts and ap are intresting to buy cars : andhra pradesh and telangana purchase number of cars. ts provode cars and bykes to police.

ప్రత్యేకం: కార్ల మోజులో అభివృద్ది మరిచిన తెలుగు రాష్ట్రాలు

Posted: 02/11/2015 03:09 PM IST
Telangana and andhra governments are more interested in buying cars than development

తెలుగు రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. అయితే రాష్ట్రాల ఏర్పాటు అంత సులభంగా కాలేదు. తెలుగు ప్రజల మనసులో కంటికి కనిపించని మంటనే రగిల్చింది. అయితే ప్రస్తుతానికి మాత్రం రెండు రాష్ట్రాలు తమ భవిష్యత్తు కోసం పోరాటాన్ని ప్రారంభించాయి. ఒకదానితో ఒకటి అభివృద్దిలో, అసమానతల్ని రూపుమాపడంలోనూ  పోటీ పడాల్సి ఉంది. అయితే అభివృద్ది మాటేమో కానీ ఒక రాష్ట్రం తొడగొడతే మరో రాష్ట్రం మాత్రం మెడ కోసుకునే లా ఉంది వ్యవహారం. వ్యవస్థల్లో మార్పుల పేరుతో రెండు ప్రభుత్వాలు చేస్తున్న హడావిడి ఎలాంటి ఫలితాలనిస్తుందో చూడాలి.

ముందు నుండి వ్యవస్థల్ని అధునీకరిస్తానని ప్రకటించిన కెసిఆర్ ఆ దిశగా చర్యలకు పూనుకున్నారు. అందులో భాగంగా ముందు పోలీస్ వ్యవస్థలో మార్పులకు పూనుకున్నారు.  శాంతిభద్రతల బలోపేతానికి పోలీస్‌శాఖకు కొత్త వాహనాలు అందించింది. చాలా కాలంగా పాత వాహనాలతో కుస్తీ పడుతున్న వాటి స్థానంలో వీటిని తీసుకువచ్చారు. తెలంగాణలోని తొమ్మిది జిల్లాల్లో పెట్రోలింగ్ నిర్వహణకు పోలీసుశాఖ 426 సుమోలు, 256 బొలెరోలు కొనుగోలు చేసింది.  నాలుగు జిల్లాలకు పూర్తిగా సుమోలు, మిగతా ఐదు జిల్లాలకు బొలెరోలు పంపిణి జరిగింది. డిజిపి నుండి ఎస్పీ వరకు అందరికి కొత్త వాహనాలను అందించింది తెలంగాణ సర్కార్.

తెలంగాణ సర్కార్ ఇలా ఇన్ని వాహనాలు కొనుగోలు చేయడంతో మీడియాలో వరుస కథనాలు వచ్చాయి. ఇంకేముంది తెలంగాణ రాష్ట్రం కొన్నప్పుడు మన రాష్ట్రంలోనూ కొనాల్సిందే అనుకున్నట్లున్నారు ఎపి అధికారులు. అందుకే కొత్త వాహనాలకు సంబందించిన ఫైల్ ను చకచకా తయారు చేశారు.  హైదరాబాద్ పోలీసులకు సుమారు 300 వాహనాలను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అందచేస్తే , ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎపి పోలీసులకు 2400 వాహనాలను అందజేశారు. వీటిలో కార్లు,జీపులు, మోటార్ బైకులు మొదలైనవి ఉన్నాయి

ఇలా రెండు తెలుగు రాష్ట్రాలు అత్యవసరాలు కాని వాటికి భారీగా ఖర్చు చేస్తున్నాయని విమర్శ. ఇక ఈ మధ్య కొత్త వాహనాలను తమ స్వంత పనలకు వాడుకుంటున్నారని తెలంగాణ ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. రాష్ట్రాల్లో శాంతి భద్రతలు ఎంతో ముఖ్యం దాన్ని ఎవరూ కాదనరు, కానీ అభివృద్ది అందరికి అవసరం. పోలీస్ వ్యవస్థ కన్నా ముందు పారిశ్రామిక, ఐటి, జౌలి రంగాలకు ప్రాధాన్యత ఇస్తే రెండు రాష్ట్రాలు వేగంగా ముందుకు సాగుతాయి. రాష్ట్రాల అభివృద్దిపై దృష్టి సారించకపోతే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నవ్వుల పాలుకాక తప్పదు. కెసిఆర్ పోలీసులకు వాహనాలు కొనడం తప్ప ఏమీ చేయలేదని నారా లోకేష్ మాట, అటు కెసిఆర్ కు, ఇటు చంద్రబాబుకూ వర్తిస్తుంది.

-అబినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles