Delhi elections in telugu proverbs

telugu proverbs, delhi elections, aap govt., aap wins

delhi elections in telugu proverbs : telugu proverbs are suitable to the delhi elections. every proverb has its own neaning for this elections.

తెలుగు సామెతల్లోఎన్నికల ఫలితాలు

Posted: 02/11/2015 02:05 PM IST
Delhi elections in telugu proverbs

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆప్ కొనసాగించిన విజయదుంధుభిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. బీజేపి చేసిన తప్పుడు, ఆప్ తీసుకున్న నిర్ణయాలు ఢిల్లీ ఓటర్ల మనసుల్ని కదిలించాయి. ఎన్నికల తీరుపై తెలుగు సామెతలు ఎలా కుదిరాయో చూడండి.

ఆలస్యం అమృతం విషం...ఢిల్లీ ఎన్నికల నిర్వహణకు బిజేపి చేసిన ఆలస్యం ఆ పార్టీకి విషంగానూ, ఆప్ కు అమృతంగానూ పని చేసింది

చెడపకురా చెడేవు....బీజేపి తన గెలుపు గురించి కన్నా ఆప్ విజయావకాశాలపైనే దెబ్బతియ్యాలని ప్రయత్నించింది. అందులో భాగంగానే ఆప్ నేతలను బిజెపిలోకి ఆహ్వానించింది. కానీ అది ఆప్ కు మంచే చేసింది.

తాడిని తన్నే వాడుంటే వాని తలదన్నే వాడుంటాడు....లోకసభ ఎన్నికల తర్వాత బీజెపి మహారాష్ట్ర, హర్యానా, ఝార్ఖండ్ , జమ్ము కాశ్మీర్ ఎన్నికల్లో బీజెపి దాదాపు అధికారంలోకి చేరింది. కొన్ని రాష్ట్రాల్లో అధికారానికి దగ్గరగా ఉంది. దాంతో విజయ గర్వంతో ఉన్న భాజపాకు ఢిల్లీలో పరాభవం తప్పలేదు.

నోరు మంచిదైతే ఊరు మంచిది...భాజపా నాయకులు రోజుకో వ్యాఖ్యలు చేస్తు ఆప్ ను అడ్డుకోవాలని చూశారు. అయినా ఆప్ విమర్శలను లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించింది.

మొత్తానికి ఢిల్లీ ఎన్నికలు భాజపాకు గొప్ప గుణపాఠంగా నిలిచాయన్నది మాత్రం నిజం. ఇప్పటికైనా బీజెపి నాయకత్వం విజయగర్వం నుండి బయటకు రావాలి. ఫలితాలపై విశ్లేషించి రానున్న ఎన్నికలకు సిద్దం కావాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telugu proverbs  delhi elections  aap govt.  aap wins  

Other Articles