Trans asia flight crash taipei river taivan capital

trans asia flight, trans asia fligh taipei river, trans asia flight crashed, trans asia flight trash, trans asia flight collapse bridge, trans asia flight taivan river, taivan capital taipei

trans asia flight crash taipei river taivan capital : A trans asia flight losses control and land in taipei river. But the flight sinks.

బ్రిడ్జిని ఢీకొట్టి.. నదిలో కూలిన ఏషియా విమానం!

Posted: 02/04/2015 11:19 AM IST
Trans asia flight crash taipei river taivan capital

తరుచూ జరిగే రోడ్డు ప్రమాదాల్లాగే విమానాలు కూడా కుప్పకూలిపోతున్నాయి. ఇటీవలే ఎయిర్ ఏషియా q8501 విమానం వాతావరణ పరిస్థితుల కారణంగా అదుపు తప్పి సముంద్రంలో పడి కూలిపోగా.. తాజాగా ట్రాన్స్ ఏషియా సంస్థకు చెందిన ఓ విమానం నదిలో పడి కుప్పకూలిపోయింది. వాతావరణంలో ఎటువంటి మార్పులు లేకపోయినప్పటికీ.. ఈ విమానం కూలిపోవడం చర్చనీయాంశంగా మారింది.

ట్రాన్స్ ఏషియా సంస్థకు చెందిన ఈ విమానం.. తైవాన్ రాజధాని తైపీలో నదిలో పడి కూలిపోయింది. ప్రమాదానికి ముందు ఈ విమానం ఒక రోడ్డు బ్రిడ్జిని ఢీకొట్టడ వల్ల అదుపు తప్పి నదిలో పడిపోయిందని తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 58 మందికిపైగా ప్రయాణికులు వున్నట్లు సమాచారం! అయితే.. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది విమానంలో చిక్కుకున్నవారిలో 10 మందిని సురక్షితంగా బయటకు తీశారు. గాడపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారి పరిస్థితి ఎలా వుందో ఇంకా తెలియాల్సి వుంది. కొందరు చనిపోయి వుంటారని అధికారులు తెలుపుతున్నట్లు తెలిసింది. మరోవైపు ఈ విమానం నదిలో మునిగిపోయే దృశ్యాన్ని తైవాన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ చిత్రీకరించింది.

ఇదిలావుండగా.. వాతావరణంలో ఎటువంటి మార్పులు లేకపోయినా ఈ విమానం కూలడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఒక రోడ్డు బ్రిడ్జిని ఢీకొట్టేరకంగా పైలట్ విమానాన్ని ఎందుకు నడిపాడని కొందరు నిలదీస్తున్నారు. పైలట్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని అంటున్నారు. మరోవైపు.. సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడం వల్ల పైలట్ కన్ఫ్యూజన్’కు గురయి వుంటాడని, ఆ సమయంలో టెన్షన్’తో నడపపంలో తడబడి వుంటాడని, అందుకే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు వెల్లడిస్తున్నట్లు సమాచారం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : trans asia flight crashed  taivan capital taipei news  flight crahesh  

Other Articles