Delhi assembly elections aam aadmi bjp party survey list

delhi assembly elections, aam aadmi party, bjp party news, delhi elections news, arvind kejriwal news, kiran bedi news, narendra modi news, political parties campaign, national media survey, hindustan news channel survey, ndtv elections survey

delhi assembly elections aam aadmi bjp party survey list : According to the national media survey.. arvind kejriwal may win delhi assembly elections with low majority.

అధికార పార్టీ బీజేపీ వద్దు.. ‘ఆమ్ ఆద్మీ’యే ముద్దు!

Posted: 02/04/2015 11:41 AM IST
Delhi assembly elections aam aadmi bjp party survey list

ఢిల్లీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయి. ఈ పోటీల్లో పాల్గొంటున్న ప్రధాన పార్టీలు బీజేపీ, ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్, ఇంకా పార్టీలు ఎన్నికల ప్రచారాల్లో ఫుల్ బిజీగా వున్నాయి. ముఖ్యంగా ఆప్, బీజేపీ అయితే ఈ ప్రచారాల నేపథ్యంలో సరికొత్త సంచలనాలు క్రియేట్ చేసుకుంటూ వివాదాలుగా నిలబడుతున్నాయి. అందులో బీజేపీ అయితే ఆప్’ను టార్గెట్ చేస్తూ తనదైన రీతిలో ఆరోపణలు గుప్పిస్తోంది. అయితే.. కాస్త ఓవరాక్షన్ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన పంచ్ మాటలతో ఢిల్లీ ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదిలావుండగా.. ఎంతో ఉత్కంఠభరితంగా మారిన ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారోనన్న టెన్షన్ మొదలయ్యింది. మునుపటిలాగే ఢిల్లీ ప్రజలు ఆప్’కి అధిష్టానం ఇచ్చిపెడుతుందా..? లేక చరిత్రలో ఎన్నడూలేని విధంగా అత్యంత మెజార్టీతో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ పార్టీని గెలిపిస్తుందా..? అన్న సందేహాలు తీవ్రతరమయ్యాయి. ఏ స్థాయిలో అయితే మోడీ పార్టీకి ప్రజల నుంచి మద్దతు అందుతుందో.. అదే రేంజిలో కేజ్రీవాల్’కి దక్కడంపై అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకే.. ఈ సారి కూడా కేజ్రీవాల్ సీఎం అయ్యే అవకాశాలు చాలామేరకు వున్నాయని కొన్ని సర్వేలు లెక్కలు తేల్చి చెబుతున్నాయి.

నిన్నమొన్నటికి వరకు నిర్వహించిన సర్వేల్లో బీజేపీది పైచేయి కాగా.. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ హవా మరింత బలంగా వీస్తున్నట్లు సర్వేల్లో తేలింది. హస్తిన ఓటర్లు భారీ మెజారిటీతో కాకపోయిన స్వల్ప మెజారిటీతోనే ‘ఆప్’కు పట్టం కట్టనున్నట్లు ఇటీవలే నిర్వహించిన ప్రధాన సర్వేల ఫలితాలు వెల్లడిస్తున్నాయి. హిందుస్థాన్ టైమ్స్, ఎకనమిక్ టైమ్స్, ఏబీపీ న్యూస్‌ల సర్వేల ఫలితాల ఆధారంగా ఎన్డీటీవీ వేసిన సగటు అంచనా సర్వే ప్రకారం.. అసెంబ్లీలోని మొత్తం 70 సీట్లకు గాను ఆప్ 37 సీట్ల సాధించి అధికారంలోకి వచ్చే అవకాశముందని తేలింది.

బీజేపీకి 29, కాంగ్రెస్‌కు 4 సీట్లు దక్కొచ్చు. అలాగే.. ఏబీపీ నీల్సన్, సీ-ఓటర్, ఈటీ-టీఎన్‌ఎస్, హెచ్‌టీ, ద వీక్ సర్వేల  ఫలితాలపై ‘టైమ్స్ నౌ’ వేసిన సగటు ఫలితాల అంచనాల్లో ఆప్‌కు 34, బీజేపీకి 32, కాంగ్రెస్‌కు 2 సీట్లు రావొచ్చని తెలిసింది. మరోపక్క.. ఇండియా టుడే-సిసిరో తాజా సర్వేలో ఆప్ ఏకంగా 38 నుంచి 46 సాధించనున్నట్లు తేలింది. బీజేపీకి 19 నుంచి 25, కాంగ్రెస్‌కు 3 నుంచి 7 స్థానాలు దక్కొచ్చు. పాత సర్వేలు బీజేపీకి 38 నుంచి 37, ఆప్‌కు 28 నుంచి 29 సీట్లు రావొచ్చని అంచనా వేయడం తెలిసిందే. ఇప్పుడు అందుకు వ్యతిరేకంగా సర్వేలు వెల్లడవ్వడం చర్చనీయాంశమైంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles