Cm kcr approved some facilities to telangana parliament members

total telangana parliament members, telangana mp list, telangana mp facilities, telangana mps names, telangana trs mps list, trs mp facilities, cm kcr approved cars to mp

telangana chief minister kcr approved some facilities to tealangana parliament members

ఆయన వరమిస్తే వీళ్ళు వెళ్లి కార్లో పడ్డారు...!!

Posted: 12/27/2014 02:55 PM IST
Cm kcr approved some facilities to telangana parliament members

కొందరు తెలంగాణా ఎం పి లకు పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత వారి సొంత నియోజక వర్గాల్లో తిరిగేప్పుడు పలు సమస్యలు తలెత్తుతున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టి కి తీసుకొచ్చారు. దాంతో తెలంగాణ పార్లమెంట్ సభ్యులకు ప్రభుత్వం వరాలు ప్రకటించింది. దాంతో ఎం పి లు తీవ్ర హర్షం వెలిబుచ్చారు.

ఇక నుండి ప్రతి ఎమ్.పికి భద్రత, కారు సదుపాయం వంటివాటికి గాను ఏభై వేల రూపాయలు నెలవారీ గా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాసనసభ్యులకు ఉన్నట్లుగానే తమకు కూడా వాహన సదుపాయం వంటివి అవసరమని ఎమ్.పిలు కోరుతున్నారు. తెలంగాణలో ఎమ్.పిలు కూడా విస్తారంగా తిరిగి ప్రజా సమస్యలపై పరిశీలన చేయడానికి వారికి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం భావించింది. కొందరు ఎమ్.పిలు ఈ విషయమై ముఖ్యమంత్రి కెసిఆర్ కు విజ్ఞప్తి చేశారు. దానిపై స్పందించి ఈ వరాలు ప్రకటించారు. ఇక నుండి వారి నియోజక వర్గాల్లో ఎం.పి లు తిరిగేప్పుడు ప్రభుతవం సమకూర్చిన వాహనం లేదా ప్రభుత్వ ధనంతో వారు సమకూర్చుకున్న వాహనంలో ప్రయాణిస్తారు. ఈ సదుపాయాలు కల్పించటం పట్ల తెలంగాణా ఎం.పి లందరూ కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.


హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana cm kcr  telangana parliament members  approved facilities  

Other Articles