Police attack on couple in hyderabad

police attack on couple, police attack couple, Hyderabad police attack couple, couple protest roads worst condition, police questioned couple night long, panjagutta police attack couple, police mark treatment to couple, couple, jyothi, chandababu, police, attack, panjagutta police station, protest,

police attack on couple in hyderabad as they protest against the worst condition of roads

ITEMVIDEOS: రోడ్డు బాగోలేదన్న దంపతులపై పోలీసు మార్క్ ట్రీట్ మెంట్

Posted: 12/27/2014 01:47 PM IST
Police attack on couple in hyderabad

రోడ్లు బాగోలేవని, గొతుల మయమైన రోడ్లతో ఎన్నాళ్లు ఇబ్బందులు పడాలంటూ రోడ్డుపై బైఠాయించిన దంపతులకు పోలీసు మార్క్ ట్రిట్ మెంట్ లభించింది. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని గొంతెత్తిన దంపతులను పోలీసులు ఇబ్బందులకు గురిచేశారు. వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి.. రాత్రంతా వారిని ప్రశ్నలతో వేధించారు. కొందరు పోలీసులు దురుసు ప్రవర్తనతో వారిపై దాడి కూడా చేశారు. విషయం మీడియాకు తెలియడంతో ఇబ్బందిపడ్డ పోలీసులు.. ఎట్టకేలకు వారిని వదిలిపెట్టారు.

వివరాల్లోకి వెళ్లే.. బేగంపేటలో నివసించే చంద్రబాబు, జ్యోతి అనే దంపతులు బల్కంపేట నుంచి బేగంపేటకు వెళ్తుండగా, రోడ్డుపై వున్న గుంతలోకి వారి వాహనం దూసుకెళ్లడంతో వారు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. రోడ్ల పరిస్థితిని నిరసిస్తూ వారు రోడ్డుపై బైఠాయించారు. ట్రాఫిక్ జామ్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని పోలిస్ స్టేషన్ కు తరలించారు. రాత్రంతా వారిని పోలిస్ స్టేషన్ లోనే వుంచి ప్రశ్నల వర్షం కురింపించారు. ఈ క్రమంలో పోలీసులకు, దంపతులకు మధ్య వాగ్వాదం జరిగింది. విషయం మీడియాకు తెలసి వారు పంజాగుట్ట పీఎస్కు వెళ్లగా.... చందూ తాగి, పోలీసులతో ఘర్షణ పడినందుకే తాము అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ వెంకటేశ్వరరావు వివరణ ఇచ్చారు.

కాగా, తమను అన్యాయంగా పోలీసులు కొట్టారని బాధితురాలు జ్యోతి కన్నీటిపర్యంతమైంది. తాము బల్కంపేటలో బారసాల కార్యక్రమానికి హజరై వస్తున్నామని జ్యోతి తెలిపారు. పడిపోయిన తమను...ఏం జరిగిందో అడగకుండానే కానిస్టేబుల్ రావటం ...రావటమే దాడి చేశాడని ఆమె పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్కు తీసుకు వచ్చిన తర్వాత కూడా తన భర్తను పోలీసులు విచక్షణారహితంగా కొట్టారని, అడ్డు వెళ్లిన తనపై కూడా ప్రతాపం చూపారని జ్యోతి కన్నీటి పర్యంతమయ్యారు. ప్రజాహితం కోసం రోడ్లు బాగుచేయాలని డిమాండ్ చేస్తే.. పోలీసులతో కొట్టిస్తారా అంటూ జ్యతి అవేదన వ్యక్తం చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : couple protest  panjagutta police station  Roads  

Other Articles