Vip children caught drunk and drive ride

vip children caught drunk and drive, vip children, drunk and drive ride, drunk and drive, hyderabad youth caught drunk, hyderabad vip children caught drunk, police caught vip children,

vip children caught in drunk and drive ride, police arrests 19 members in drunk and drive case at jubilee hills

డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన ‘బడాబాబు’ల పిల్లలు..

Posted: 12/27/2014 03:03 PM IST
Vip children caught drunk and drive ride

తాగితే మర్చిపోగలను, మర్చిపోతే మనగలను అంటూ సినీ కవులు రాసిన గేయాల ప్రభావమో ఏంటో ఈ మద్యకాలం యువతకు ఎనలేని కష్టాలు వచ్చిపడుతున్నాయి. పనివత్తిడి సహా లవ్ అఫైర్ లు, మ్యారేజ్ ప్రపోజల్స్, జాబ్ టెన్సన్ ఇలా ఇత్యాది సమస్యలు వారిని అవహిస్తున్నాయి. ముఖ్యంగా హైటెక్ సీటీ రాకతో వేల రూపాయల జీతాలను అందుకుంటున్న యువత మరీనూ. దీంతో వారికి లభించే వారంతపు సెలవు దినాల్లో తాము ఎక్కడున్నాము, ఏలా వున్నాము అన్న విషయాన్ని కూడా మర్చిపోయేలా పీకల వరకు మద్యాన్ని సేవించి ఎంజాయ్ చేస్తూ పోలీసులకు అడ్డంగా దోరికిపోతున్నారు. పాశ్యాత సంస్కృతిని నిలువెల్లా తడుముకున్న బడాబాబుల పిల్లలకు వీకెండ్ అంటే ఓ పెద్ద పండగ.

వీకెండ్‌లో మందుబాబులకు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు చెక్‌పెట్టారు. పీకల వరకు మద్యాన్ని సేవించి వాహనాలను నడుపుతూ.. ఇతర ప్రయాణికులకు రోడ్లపై నరకాన్ని చూపే వారికి పోలీసలు చెక్ పెట్టారు. జూబ్లీహిల్స్లో గత రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ రైడ్ నిర్వహించారు. వారి తనిఖీల్లో పెద్ద ఎత్తున బడాబాబులు పట్టుపడినట్లు సమాచారం.  ఈ తనిఖీల్లో మొత్తం 18 మంది మద్యం తాగి బండి నడుపుతూ అడ్డంగా దొరికిపోయారు. ఈ సందర్భంగా 13 కార్లతో పాటు ఆరు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే పట్టుబడిన వారి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vip children  drunk and drive  police check  

Other Articles