Spice jet crisis spicejet airline seeks government bailout

spice jet crisis, civil aviation, king fisher crisis, spice jet cancelled flights, king fisher airlines crisis, kalanidhi maran , sun net work, dgca , domestic aviation

SpiceJet crisis is a wake-up call to the government. Successive governments have neglected aviation which is integral to economic growth

కింగ్ ఫిషర్ బాటలో స్పైస్ జెట్

Posted: 12/16/2014 01:54 PM IST
Spice jet crisis spicejet airline seeks government bailout

రోజు రోజుకు స్పైస్ జెట్ విమానయాన సంస్థ పతనావస్థ లోకి జారుకొంటుంది. మూల ధన సమీకరణ కోసం ఎన్నో ప్రయత్నాలను ఆరంభించిన సంస్థ ప్రయాణికుల కోసం ప్రత్యేక తగ్గింపు ఆఫర్లను ప్రకటించి ముందస్తు బుకింగ్ లను ప్రారంభించింది. ఆ అవకాశాన్ని ప్రయాణికులు కూడా అదే స్థాయి లో ఉపయోగించారు. కాని అలా సేకరించిన ధనాన్ని  స్పైస్ జెట్ సంస్థ మూలధన సమీకరణ కోసం ఉపయోగించలేకపోయింది. ఏది ఏమైనా సంస్థ ఆర్థికంగా గట్టెక్కాలంటే 1600 కోట్ల మూలధన పెట్టుబడులు కావాలని స్పైస్ జెట్ ఉద్యోగులు, ఆర్ధిక రంగ నిపుణులు అంతర్గతంగా చర్చించుకున్నారు. ఇప్పటికే ఇబ్బందులు మరింత జటిలం అయ్యయ్యాన్న దానికి నిదర్శనంగా ఇటీవల దేశ వ్యాప్తంగా మొత్తం 1861 విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు స్పైస్ జెట్ సంస్థ ప్రకటించింది. ముందస్తు బుకింగ్ ల విషయం లో మార్గదర్శకాలను ఉల్లంఘించిన కారణంగా డి.జి.సి.ఏ షోకాజు నోటీసు ఇవ్వాలని యోచిస్తున్న సమయంలో స్పైస్ జెట్ సంస్థ ఈ ప్రకటన చేయటం గమనార్హం. అయినప్పటికీ డి.జి.సి.ఏ స్పైస్ జెట్  సంస్థ తన యొక్క ముందస్తు బుకింగ్ లను ఆపేయాలని అప్పటికే ఆదేశించింది.

కాని మళ్ళి ఇప్పుడు ఆర్ధిక మందగమన బాటలో ఉన్న తన సంస్థకు తక్షణ ఆర్ధిక సహాయాన్ని అందించి ఆదుకోవాలని కేంద్రాన్ని  అభ్యర్థించింది. 2000 కోట్లకు పైగా రుణభారం తో స్పైస్ జెట్ సతమవుతుంది. కంపెనీ కార్యకలాపాల అధికారులు కొందరు కేంద్ర విమానయాన శాఖా సహాయ మంత్రి మహేష్ శర్మ ని కలిసి కంపెనీ రోజు వారీ వ్యాపార కార్య కలాపాల నిర్వహణ కోసం తక్షణం సహాయం చేయాలనీ అభ్యర్థించారు. కాని ఇప్పుడు కేంద్ర దానికి సమ్మతించలేదు.., పైగా నెల రోజుల్లో కంపెనీ ఆర్ధిక వ్యవహారాలన్నింటిని సరి చేసుకోవాలని హెచ్చరించింది.  

గత మూడు నెలల నుండే స్పైస్ జెట్ సంస్థ ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కుంటుంది. సంస్థ లోని ఉద్యోగులు కూడా మెల్లిగా వలస బాట పట్టారు. గత నెలలో 18 మంది పైలట్లు ఒకే సారి సంస్థ ని వదిలేసారు.  కింగ్ ఫిషర్  సంస్థ లానే స్పైస్ జెట్ కూడా పతనమయ్యే అవకాశముందని ఆర్ధిక రంగ నిపుణులు ఎప్పటినుండో హెచ్చరించారు. మొత్తానికి ఇప్పుడు అదే జరగబోతుందని ఆర్ధిక నిపుణులు ఆవేదన వ్యక్తం చేశారు.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : spice jet  aviation ministry  sun group  maran group  spice jet crisis  

Other Articles