Don t cross laxman rekha pm modi s warning to bjp mps

pm narendra modi, bjp law makers, bjp mps, controversial statements, central ministers statements

Prime Minister Narendra Modi has reportedly told BJP lawmakers that controversial statements made by some of central ministers

తోటి ఎం.పి లను హెచ్చరించిన ప్రధాని మోడీ

Posted: 12/16/2014 01:34 PM IST
Don t cross laxman rekha pm modi s warning to bjp mps

ఇటీవల కొందరు కేంద్ర మంత్రుల వ్యాఖ్యలు ప్రభుత్వానికి కొంత ఇబ్బంది కలిగించిన విషయం తెలిసిందే. తర్వాత మోడీ వారికి స్వయంగా పిలిపించుకొని ఇంకోసారి ఇలా కానివ్వకుండా చూసుకోవాలని మాటలు కాకుండా చేతల్లో చూపించాలని లేకుంటే వేటు తప్పదని హెచ్చరించినట్లు సమాచారం. మళ్ళి ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కూడా సహచర ఎం.పి లను లను ఉద్దేశించి వివాదాస్పద అంశాల జోలికి గాని వివాదాస్పద వ్యాఖ్యలుగాని చేయవద్దని చెప్పినట్లు సమాచారం.

కేంద్ర మంత్రులకు కూడా మరో సారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని మోడీ హెచ్చరించారు. ఎవరు కూడా తన పరిధి దాటి ప్రవర్తించవద్దని ఎంత జాగ్రత్తగా ఉంటె ప్రభుత్వానికి అంత మేలని సూచించారు. లక్ష్మన రేఖ దాటి ప్రవర్తిస్తే.., అప్పుడు ప్రభుత్వానికి పార్టీ కి రెండింటికి నష్టమేనని వ్యాఖ్యానించినట్లు సమాచారం. అలాంటి వ్యాఖ్యలతో పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దని హెచ్చరించారు. అభివృద్ధి పనులు కూడా కేవలం దస్త్రాల్లో కనిపించకూడదని అభివృద్ధి పనులనేవి ప్రత్యక్షంగా కనిపించాలని చెప్పినట్లు సమాచారం.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bjp ministers  controversial sattements  centaral ministers  bjp law makers  bjp party  

Other Articles