Narendra modi led nda government announces bharat ratna award

bharat ratna, Bharath rathna, atal bihari vajpayee, bjp party, nda government, narendra modi, prime mnister for bharath ratna

Former Prime Minister Atal Bihari Vajpayee, is likely to be awarded with India's highest honour, the Bharat Ratna

వాజ్ పేయి కి భారత రత్న...!!

Posted: 12/16/2014 02:43 PM IST
Narendra modi led nda government announces bharat ratna award

ప్రతి పక్షంలో ఉన్నప్పటి నుండే భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన గౌరవనీయులైన శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయ్ గారికి "భారత రత్న" అవార్డ్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వచ్చింది. కాని ఇప్పుడు రాజకీయ పరిణామాలన్నీ మారిపోవటం.., బి జె పి అధికారం చేపట్టటం చక చక జరిగిపోయాయి. ఇప్పుడు పార్టీ అగ్రనేత కి అగ్ర గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతోనే దేశ అత్యున్నత పౌరపురస్కారం 'భారతరత్న' మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయికి ఇవ్వాలని అధికార పార్టీ అయిన బి జె పి నిర్ణయించింది. దానితో ఈ నెల 25 న వాజ్ పయి 90 వ జన్మ దినాన్ని పునస్కరించుకొని నరేంద్ర మోడీ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించబోతున్నారని సమాచారం. భాజపా మొట్ట మొదటి ప్రధాన మంత్రి వాజ్ పయి పుట్టిన రోజును సుపరిపాలన దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే.

ఈ నెల 25న వాజ్ పేయి జన్మదినం సందర్భంగా అగ్ర నేతకు ఈ అవార్డు ప్రకటించాలని కేంద్రం భావిస్తున్నట్టు, ఆ రోజే నరేంద్ర మోడీ అధికారికంగా వెల్లడించనున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ అవార్డు గౌరవనీయులు శ్రీ వాజ్ పేయి గారికి ప్రకటిస్తే ఈ అవార్డు స్వీకరించిన ప్రధానమంత్రులలో ఈయన ఏడవ వ్యక్తి అవుతారు.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles