Paul rasolie anaconda discovery channel

paul rasolie anaconda video, paul rasolie anaconda latest updates, anaconda swallows man, anaconda photos, discovery channels amazing videos, wild life videos, world latest news updates

paul rasolie anaconda discovery channel : all awaited video of paul rasolie telecasted in discovery channel on sunday 07th december wih high trp rating. discovery fans attracted by paul rasolie amazing anaconda video

అన్నంతపనీ చేశావుగా పాలూ

Posted: 12/08/2014 12:49 PM IST
Paul rasolie anaconda discovery channel

పాపులారిటీ, క్రేజ్, హాబీ ఇలా ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి ఉంటుంది. దీనికోసం ఏం చేయటానికైనా వెనకాడరు. పాల్ రసౌలి ఆనకొండ వీడియో చూస్తే ఇది నిజమని తెలుస్తుంది. చిన్న పామును చూస్తేనే వణికిపోయి జ్వరం వచ్చేవారు చాలామంది ఉండగా., ఏకంగా అనకొండతో ఆటఆడాడు. అది మామూలు ఆటకాడు.., మనుషుల్ని అమాంతం మింగేసే అనకొండ పొట్టలోకి వెళ్ళి ఓ గంట సేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ సురక్షితంగా బయటకు వచ్చాడు.

డిస్కవరీ ఛానెల్ కోసం చేసిన ఈ వీడియో ఆదివారం ప్రసారం అయింది. వీడియోను చూసిన కోట్లాదిమంది ప్రేక్షకుల ఒళ్ళు గగుర్పొడిచింది. ప్రత్యేకమైన కార్బన్ ఫైబర్ సూట్ ధరించి ఈ ఫీట్ చేసాడు. అధునాతన సమాచార వ్యవస్థతో పాటు వీడియో కెమెరాలు తీసుకుని అనకొండ కడుపులోకి వెళ్ళాడు. ఇక ముందుగా పాల్ ను మింగేందుకు పాము కూడా ఆసక్తి  చూపలేదట. అయితే దాన్ని రెచ్చగొట్టి మరీ మింగేందుకు ముందుకు వచ్చేలా చేశాడు.

అలా  అనకొండ మింగగానే చకచకా లోపలికి వెళ్లి వీడియో తీశాడు. ఆ తర్వాత ఆనకొండకు ఏ హాని జరగకుండా బయటకు వచ్చాడు. తాను ఎలా బయటకు వచ్చాననే విషయం వెల్లడించని పాల్..., పాము మాత్రం ప్రస్తుతం సురక్షితంగా ఉందని చెప్పాడు. ఈ వీడియో ప్రమోషన్ నుంచి తెగ క్రేజ్ రావటంతో ఆదివారం ప్రసారంకు టీఆర్ పీ  రేటింగ్ బాగా వచ్చిందట. దీంతో త్వరలోనే స్వీడన్, ఫైన్ ల్యాండ్, డెన్మార్క్, ఆస్ట్రేలియా దేశాల్లో వీడియోను ప్రసారం చేస్తామని డిస్కవరీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు మూగజీవాన్ని ఛానెల్ కోసం హింసించారని పెటా ప్రతినిధులు మండిపడుతున్నారు.

కార్తిక్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : paul rasolie anaconda  discovery channel videos  great amazing stunts  

Other Articles