The two yadavs have mixed and matched personal and political alliances in this week

mp tej prathap singh, tej prathap singh yadav marriage, mulayam singh yadav and lal prasad yadav, lalu prasad yadav younger daughter, akhilesh yadav, uttar pradesh news, bihar news, lalu prasad yadav younger daughter rajyalaxmi, rabridevi daughter

Lalu's youngest daughter, Rajalaxmi, is to be engaged to Mulayam's grand-nephew, Tej Pratap.

యాదవుల రాజకీయ "బంధుత్వం"

Posted: 12/08/2014 01:30 PM IST
The two yadavs have mixed and matched personal and political alliances in this week

బీహార్ రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన లాలు ప్రసాద్ యాదవ్.., దేశంలోనే అతిపెద్ద రాష్ట్రాన్ని పాలిస్తున్న సమాజ్ వాది పార్టీ అధినేత అయిన శ్రీ ములాయం సింగ్ యాదవ్ రాజకీయంగానే కాదు బందుత్వంతోను ఒక్కటి కాబోతున్నారు. బి జె పి ని ఎదుర్కునేందుకు మరియు దేశంలో ఒక రాజకీయ శక్తిగా ఎదేగేందుకు ఇప్పటికే రాజకీయంగా పావులు కదుపుతున్న యాదవ త్రయం తమ తదుపరి తరంతో బంధువులుగా మారుతున్నారు. లాలు ప్రసాద్ యాదవ్ చిన్న కుమార్తె రాజ్య లక్ష్మి కి ములాయం సింగ్ మనవడు అయిన శ్రీ తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్ కి వివాహ నిశ్చితార్థం ఈ వారంలో జరగబోతుంది. సోమవారం దానికి ముందు  జరిగే కార్యక్రమంలో ఇరు కుటుంబాల సభ్యులు పాల్గొనబోతున్నారు. దీనికి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన అఖిలేష్ యాదవ్ కూడా హాజరవుతున్నారు. ములాయం సింగ్ ఈ విషయమై మాట్లాడుతూ మా బంధం ఇలాగే ఎల్లకాలం కొనసాగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.  

తేజ్ ప్రతాప్ సింగ్ ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ సభ్యునిగా  ఉన్నారు. మెయిన్ పురి నియోజకవర్గ ఎం.పి గా మే లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో సమాజ్ వాది పార్టీ నుండి గెలుపొందారు. అంతకు ముందు ఈ నియోజకవర్గానికి ములాయం సింగ్ యాదవ్ ప్రాతినిధ్యం వహించారు. తేజ్ ప్రతాప్ తండ్రి ములాయం సింగ్ గారి అన్నయ్య కుమారుడు. ఇతను ఢిల్లీ దగ్గరలోని నోయిడాలో అమిటీ యూనివర్సిటీ లో విద్య అభ్యసిస్తున్నపుడు అదే యూనివర్సిటీ లో చదువుకుంటున్న లాలు ప్రసాద్ యాదవ్ కుమార్తె  రాజ్యలక్ష్మి ఇరువురు ప్రేమించుకున్నారు. పెళ్లి ముహూర్తాన్ని ఫిబ్రవరి నెలలో జరిగేలా ఖరారు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akhilesh yadav  mulayam singh yadav  lalu prasad yadav  rabri devi  tej prathap singh  

Other Articles