Title gif

kcr delhi tour, kcr delhi tour meetings, kcr on telangana, central government telangana funds, telangana development, kcr on telangana development, telangana government latest updates, union ministers on telangana, latest news updates

kcr delhi tour update : telangana chief minister kcr delhi tour have busy schedule with continuous meetings with central ministers. kcr meets most of union ministers during his delhi tour for telangana development

ఈసారైనా మొర ఆలకించేనా..?

Posted: 12/08/2014 09:38 AM IST
Title gif

రాష్ర్ట అభివృద్ధి ప్రధాన ఎజెండాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగింపు దశకు చేరుకుంది. రెండ్రోజుల పాటు పలువురు కేంద్ర మంత్రులను కలుస్తూ తెలంగాణకు కేటాయింపులపై విజ్ఞప్తులు చేస్తున్నారు. చివరి రోజైన సోమవారం కూడా వరసగా అపాయింట్ మెంట్లు ఫిక్స్ చేసుకున్నారు. విభజన సమస్యలు, రాష్ర్ట అభివృద్ధి లక్ష్యంగా జరుగుతున్న పర్యటనకు కేంద్ర నేతలు కూడా బాగానే మద్దతు ఇస్తున్నారు. కేసీఆర్ చెప్పే విజ్ఞప్తులు ఓపిగ్గా వింటున్నారు.

చివరి రోజైన ఇవాళ సీనియర్ కేంద్రమంత్రులను కేసీఆర్ కలుస్తారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంటుకు వెళ్లిమరీ కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, ఇందన శాఖ మంత్రి పియూష్ గోయల్, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీలను కలుస్తారు. హోంమంత్రితో సమావేశమై ఐఏఎస్ ఐపీఎస్ ల విభజనపై చర్చిస్తారు. రాష్ర్టం ఏర్పడి ఆరు నెలలు దాటినా ఇప్పటివరకు అధికారుల విభజన జరగకపోవటం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని  తెలపనున్నారు. అదేవిధంగా పదవి షెడ్యూల్ లోని ఉమ్మడి సంస్తల విభజన ఇతర అంశాలను ప్రస్తావించనున్నారు.

ఇక పియూష్ గోయల్ తో సమావేశం సందర్బంగా తెలంగాణకు వెయ్యి మెగావాట్ల  విద్యుత్ ఇవ్వాలని కోరనున్నారు. దక్షిణిదా గ్రిడ్ నుంచి ఈ విద్యుత్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తారు. ఇక కేంద్ర ఆర్దిక మంత్రి     అరుణ్ జైట్లీతో సమావేశమై తెలంగాణకు ప్రత్యేక హోదా కల్పించి., ప్యాకేజి ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఇందుకోసం తెలంగాణ ఉన్నతాధికారులు రూపొందించిన ప్రత్యేక నివేదికను జైట్లికి అందిస్తారు. అటు ఉమాభారతితో సమావేశమై రాష్ర్ట నీటి సమస్యలు, కేటాయింపుల్లో ఇబ్బందులను వివరించనున్నారు.  గతంలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి కేంద్రమంత్రులను కలిసి విజ్ఞప్తులు చేశారు. అయితే వాటి ఫలాలు మాత్రం ఇప్పటివరకు అందలేదు. మరి ఈ పర్యటన అయినా ఏ మేరకు హామిలు తెప్పిస్తుందో..., ప్రకటనలుు చేయిస్తుందో చూడాలి.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr delhi tour  narendra modi on telangana  latest news  

Other Articles