Bhagwad gita as a rashtriya granth national book

Bhagwad Gita, Sushma swaraj, Geetha preran mahosthav, Natinal book, Rashtriya grandh, Ashpk singhal, VHP, devotinal.

Ms Swaraj was speaking at 'Gita Prerna Mahotsav', organised "to celebrate 5,151 years of religious book Gita at the Red Fort Maidan in New Delhi

జాతీయ గ్రంధంగా భగవద్గీత.

Posted: 12/08/2014 11:29 AM IST
Bhagwad gita as a rashtriya granth national book

భగవద్గీతను జాతీయ గ్రంధంగా కేంద్రం ఆమోదించేలా కృషి చేస్తుందని  కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి శ్రీమతి సుష్మ స్వరాజ్ గారు ప్రకటించారు. దీనికి సంబంధించి కేవలం అధికారిక విధివిధానాలు పూర్తి కావాల్సి ఉందని ప్రకటించారు. భగవద్గీత  5151 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఢిల్లీ లోని రెడ్ ఫోర్ట్ మైదాన్ లో నిన్న జరిగిన గీత ప్రేరణ మహొత్సవంలో ఈ విషయాన్ని వెల్లడించారు. భగవద్గీతను చదవటం వల్ల ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని.., దాన్ని పటించటం మూలాన తాను  విదేశాంగ మంత్రి గా ఎన్నో సవాళ్ళను దీటుగా ఎదుర్కోగలుగుతున్నానని చెప్పారు. ప్రతీ ఒక్కరు భగవద్గీతను పారాయణం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. రోజుకు 2 శ్లోకాల చొప్పున ప్రతీరోజు పారాయణం చేస్తే ఒక్క సంవత్సరంలో భగవద్గీతను పూర్తి చేయవచ్చని సభికులను ఉద్దేశించి తెలిపారు.  

మొట్టమొదటి సారి గ్రంథాన్ని చదివినపుడు "ఏది జరిగిన మన మంచికే జరిగింది భవిష్యత్ లో ఏది జరగబోయిన మన మంచికే జరగబోతుంది" అన్న నిగూడార్థం కలిగిన అధ్యాయాన్ని తాను అర్థం చేసుకోలేదని  కాని ఆ గ్రంథాన్ని రెండు మూడు సార్లు చదివాక అర్ధమైందని.., అది తన జీవితానికి ఎంతో ఉపకరించిందని దాని వల్లే ఇపుడు విదేశాంగ మంత్రిగా సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నానని తెలిపారు. భగవద్గీతపై నమ్మకం., గౌరవం మీదే  గౌరవనీయులైన మన ప్రధాన మంత్రి గారు అమెరికా అధ్యక్షుడు ఒబామాకి ఈ గ్రంథాన్ని బహుమతిగా ఇచ్చారని తెలిపారు. ఈ సభ లో సుష్మ స్వరాజ్ ఇచ్చిన ప్రసంగంపై వి హెచ్ పి అధినేత అశోఖ్ సింఘాల్ స్పందిస్తూ భగవద్గీతను జాతీయ గ్రంథంగా  ప్రకటించాలని తాము ఎప్పటినుండో కోరుకుంటున్నామని ఇప్పుడు ఇట్టి విషయంపై కేంద్రం ఆలోచిస్తుండటం శుభాపరిణామమని అన్నారు. కాని ఈ ప్రతిపాదనపై కొన్ని ఇతర పార్టీల నుండి  ఇప్పటికే విమర్శలు మొదలయ్యాయి. ఈ విమర్శలపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.

హరికాంత్ రామిడి 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sushma swaraj  external minitry  devotional updates  Trinamool congress  Securalism.  

Other Articles