Chief ministers supports to central government decisions says arun jaitley

cooperative federalism replaces planning commission, modi replaces planning commission, modi brings cooperative federalism, arun jaitley briefs cm's meet,

Finance Minister Arun Jaitley addressed a press conference after the meeting. Most CMs present themselves, CMs of West Bengal, Mizoram were represented by Finance Ministers; 2 poll-going states represented by senior officials.

కేంద్రం ప్రతిపాదనను ముఖ్యమంత్రులందరూ అమోదించారు..

Posted: 12/07/2014 10:10 PM IST
Chief ministers supports to central government decisions says arun jaitley

ప్రణాళిక సంఘానికి బదులుగా నూతన సంస్థ స్థాపన కోసం మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ఆదివారం న్యూఢిల్లీలో వివిధ రాష్ట్రాల సీఎంలు, ప్రధాన కార్యదర్శులతో మోడీ తన నివాసంలో సమావేశమైయ్యారు. ఆ సమావేశం వివరాలను జైట్లీ మీడియాకు వెల్లడించారు. మొదటి బృందంలో ప్రధాని, ముఖ్యమంత్రులు...  రెండో బృందంలో ప్రధాని, కేంద్ర మంత్రి మండలి... మూడో బృందంలో ప్రధాని, ఉన్నతాధికారులు ఉంటారని తెలిపారు. 1950లో ప్రణాళిక సంఘంఏర్పాటైనా...1992 నుంచి దేశంలో సంస్కరణలు మొదలయ్యాయని జైట్లీ గుర్తు చేశారు.

దేశాభివృద్ధికి మరన్ని ప్రణాళికలు అవసరమని అన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది సీఎంలు సమర్థించారని జైట్లీ చెప్పారు. ప్రధాని, ముఖ్యమంత్రులు, అధికారులు కలిస్తేనే టీమిండియా అని జైట్లీ చమత్కరించారు. జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల సీఎంలు మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల సీఎంలు ఈ సమావేశానికి హాజరయ్యారని అరుణ్ జైట్లీ వెల్లడించారు. ఈ సంస్థ ఏర్పాటుపై అన్ని రకాల సలహాలు, సూచనలు అందిన తర్వాతే ముందుకు వెళ్తామన్ని చెప్పారు.

ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్యమంత్రులు హాజరయ్యారని ఆయన చెప్పారు. పశ్చిమ బెంగాల్, మిజోరం రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థానంలో ఆయా రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు సమావేశానికి హాజరయ్యారని చెప్పారు. ఎన్నికలు జరుగుతున్న జమ్మూకాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాలలో ముఖ్యమంత్రుల బదులుగా ప్రత్యేక అధికారులు సమావేశానికి హాజరయ్యారని అరణ్ జైట్లీ తెలిపారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra Modi  planning commission  cooperative federalism  arun jaitley  

Other Articles