Australian cricketer phillip hughes funeral brings town to a halt

Australian cricketer, Phillip Hughes, funeral, Tony Abbott, opposition leader Bill shorten, indian cricketer, virat kohli, Ravi shastri, Brain Lara, Macksville, New South Wales

Australian cricketer Phillip Hughes funeral brings town to a halt

ముగిసిన ఫిల్ హ్యూస్ అంత్యక్రియలు

Posted: 12/03/2014 11:15 AM IST
Australian cricketer phillip hughes funeral brings town to a halt

అస్ట్రేలియాలో దేశవాలీ క్రికెట్ అడుతూ.. సియాన్ అబౌట్ విసిరిన బౌన్సర్ బాల్ ను బౌండరీకి తరలించే ప్రయత్నంలో విఫలమై.. నేలకొరిగిన క్రికెట్ ధృవతార ఫిలిమ్ హ్యూస్ అంత్యక్రియలు ముగిసాయి. అస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ పట్టణ శివార్లలో వున్న హ్యూస్ సొంత గ్రామం మాక్స్ విల్లీలో నిర్వహించారు. హ్యూస్ అంతియ యాత్రలో వేలాది మంది హ్యూస్ కు తుది వీడ్కోలు పలికారు. అస్ట్రేలియా ప్రధాని టోని అబాట్, విపక్ష నేత బిల్ షార్టన్, అస్ట్రేలియా క్రికెట్ బోర్డు సీఈఓ సుదర్ ల్యాండ్ తదితర అధికారులు హాజరయ్యారు.

Phillip-Hughes-funeral-2

Phillip-Hughes-funeral-3

మాక్స్‌విలే హైస్కూల్ స్పోర్ట్స్ హాల్‌లో  అంతిమ సంస్కారాల కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, ఆసీస్ క్రికెటర్లతో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. భారత దేశం తరపున రవిశాస్త్రీ,  విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇటు ప్రధాని కూడా హ్యూస్ కు అంతిమ విడ్కోల సందర్బంగీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హ్యూస్ తో పాటు తన ఆటను కూడా కోల్పోతున్నామని ప్రధాని ట్విట్టర్ ద్వారా తన సంతాప సందేశాన్ని వెలిబుచ్చారు. వెస్టిండీస్ తరపున బ్రెయన్ లారా, పలు దేశాలకు చెందిన ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.

Phillip-Hughes-funeral-4

ఆటగాళ్ల 'గార్డ్ ఆఫ్ ఆనర్'

తొలుత క్రికెటర్లు హ్యూస్‌కు 'గార్డ్ ఆఫ్ ఆనర్' సమర్పించనున్నారు. తర్వాత ఆటగాడి పార్థివ దేహాన్ని మాక్స్‌విలేలో అంతియ యాత్రను కోనసాగించారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ హాల్‌కు హాజరైన ప్రతి ఒక్కరూ గ్రామంలోని వీధుల వెంబడి వరుసగా నిలబడి హ్యూస్‌కు ప్రత్యేక వీడ్కోలు పలకారు..  మాక్స్‌విలేలో ప్రసిద్ధి చెందిన 'టైలర్స్ ఆర్మ్ హోటల్'కు కొద్ది దూరంలో హ్యూస్ ఎంతో ఇష్టపడి కొనుకున్న వ్యవసాయం క్షేత్రం 408లో క్రికెటర్ దేహాన్ని ఖననం చేయనున్నారు. ఒక్కసారిగా అన్యూహ్యంగా మాక్స్ వీల్లీ గ్రామ వీధులన్నీ జనసంద్రమయ్యాయి. భారీ ఎత్తున్న తరలివచ్చిన ప్రజలు హ్యూస్ కు తుది వీడ్కోలు పలకడానికి వచ్చారు. వ్యవసాయ క్షత్రం యావత్తు పుష్పగుచ్చాలతో నిండుకుంది. తాను చివరి సారిగా సాధించిన 63 పరుగులను వీరోచిత పరుగులుగా ఆటగాళ్లు అభివర్ణించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles