Tammareddy bharadwaja made sensational comments on tollywood

Tammreddy Bharadwaja, memu saitham, Sensational comments, tollywood, filmfare awards, nandi awards, volentarily efforts, sp balasubramaniyam

tammareddy bharadwaja made sensational comments on tollywood

మేము సైతం.. వెండి వెలుగులు.. ఇంతేనా..?

Posted: 12/03/2014 01:20 PM IST
Tammareddy bharadwaja made sensational comments on tollywood

మన హీరోలు మగాళ్లు కారు.. హీరోలకు దమ్ములేదంటూ' గతంలో సంచలనాలకు తెర లేపిన ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మరోమారు కూడా అదేస్థాయిలో విరుచుకుపడ్డారు. ముక్కుసూటిగా మాట్లాడే నైజం వున్న అతికొంత మంది టాలీవుడ్ ప్రముఖుల్లో ఒకరైన తమ్మారెడ్డి.. నిజాలను నిర్భయంగా బహిర్గత పరుస్తారు కూడా. తాజాగా ఆయన మరోమారు సంచలన వ్యాఖ్యాలు చేశారు. చిత్తూరులో ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఒక్కరే గంట పాటు స్వరాలపన చేయడంతో కోటి రూపాయల నిధులు సమకూరాయన్నారు,

అలాంటి టాలీవుడ్ అంతా కలసి ఒక్క తాటిపైకి వచ్చి.. సుమారు పన్నెండు గంటల పాటు నిర్వహించిన మేము సైతం కార్యక్రమానికి కేవలం ఎనమిది కోట్ల రూపాయలు మాత్రమే రావడంతో.. టాలీవుడ్ వెండి వెలుగులు ఇంతేనా అంటూ తమ్మారెడ్డి భరద్వాజ వాపోయారు. ఇటువంటి కార్యక్రమాలకు హీరోలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని.. ప్రేక్షకులు లేకుంటే.. సినిమాలు ఎలా ఆడతాయని, హీరోలకు అలాంటి ఇమేజ్ ఎక్కడి నుంచి వస్తుందని ఆయన ప్రశ్నించారట. విశాఖ తుపాను బాధితుల కోసం నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యేందుకు కొందరు హీరోలను బతిమిలాడుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఓ ప్రైవేటు సంస్థ అందించే ఫిలింపేర్ అవార్డుల కోసం ఎగేసుకుని వెళ్లే ఆర్టిస్టులు.. ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డుల కార్యక్రమాలకు మాత్రం రావటం లేదని ఆయన చురకలంటించారు. రాష్ట్ర విభజన అనంతరం చిత్ర పరిశ్రమ పెద్దలు తెలంగాణ మంత్రి కేటీఆర్ను కలిశారని.. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని తమ్మారెడ్డి పేర్కొన్నారు. మొత్తానికి మరోమారు తమ్మారెడ్డి భరద్వాజ చేసిన హాట్ కామెంట్స్ తో తెలుగు సినీ వినీలాకాశంలో తారలు మధ్య అనేక విభేధాలు కొనసాగుతున్నాయని అర్థమవుతోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles