Five militants killed in jammu and kashmir gunfight

Five militants, killed, gunfight, Jammu and Kashmir, infiltration bid, foiled, Nowgam sector, Kupwara district, Line of Control (LoC), Tut Mari Gali Sector, JCO

five militants killed in jammu and kashmir gunfight

జమ్మూలో కాల్పులు..ఐదుగురు ఉగ్రవాదలు హతం

Posted: 12/03/2014 10:28 AM IST
Five militants killed in jammu and kashmir gunfight

జమ్మూ ప్రజల తమ మాటలను లక్ష్య పెట్టకుండా ఓటింగ్ లో పాల్గొంటూ.. భారీ స్థాయిలో రికార్డు పోలింగ్ నమోదు కావడంతో.. ఇక తమ ఆటలు సాగవన్న పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు.. నియంత్రణ రేఖను దాటి అక్రమంగా భారత భూభాగంలోకి చోచ్చుకోచ్చారు. ఇక్కడ అప్పటికే తిష్టవేసిన మరికోందరు ఉగ్రవాదులతో కలసి కాశ్మీర్ లో విధ్వంస రచనకు కుట్రలు పన్నారు. జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలోని నౌగామ్ సెక్టార్ లోకి వచ్చిన తీవ్రవాదులకు చోచ్చకోచ్చారన్న సమాచారంతో భద్రతా ధళాలు వారిని చుట్టముట్టాయి

ఉగ్రవాదులు తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో వారిని పారిపోనీయకుండా వారిని భద్రతాదళాలు చుట్టుముట్టడంతో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భారత భద్రతా దళాలు కూడా గట్టిగానే బదులిచ్చాయి. తీవ్రవాదులకు భద్రత సిబ్బందికి మధ్య జరిగిన హోరాహోరి కాల్పుల్లో మొత్తం ఐదుగురు తీవ్రవాదులు మరణించారని ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇద్దరు ఉగ్రవాదులను నౌగామ్ సెక్టార్ లో తుదముట్టించిన భారత ఆర్మీ, మరో ముగ్గురిని టుట్ మారీ గలీ సెక్టార్ లో మట్టుబెట్టింది. ఈ కాల్పుల్లో భారత భద్రతా దళానికి చెందిన జూనియర్ కమీషన్ అధికారి కూడా మరణించారని అధికారులు తెలిపారు.

మరో ముగ్గురు సైనికులు కూడా కాల్పుల్లో గాయపడ్డారని, వారని ఆస్పత్రికి తరలించి చికిత్స నందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.  ఉగ్రవాదుల వద్ద నుంచి రైఫిళ్లతో పాటు భారీగా ముందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. దీంతో పాటు ఉగ్రవాదుల వద్దనున్న యుద్ద సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. భారత భూభాగంలో మరెవరైనా ఉగ్రవాదులు వున్నారన్న అన్న అంశంపై ముమ్మర తనిఖీలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles