Andhra pilustondi chandra babu new documentary inviting singapore industralists for investments

Andhra Pilustondi, Chandra Babu, Documentary, Singapore, industralists, investments, southasia summit, strategies, government’s subsidies, incentives, establish, companies, futuristic ideas

Andhra Pilustondi' Chandra Babu's new documentary, inviting singapore industralists for investments

పెట్టుబడులపై దక్షిణాసియా సదస్సుకు బాబు డాక్యూమెంటరీ..

Posted: 11/12/2014 01:36 PM IST
Andhra pilustondi chandra babu new documentary inviting singapore industralists for investments

రాష్ట్ర విభజనతో రాజధానికి దూరమై.. అదాయం లేక కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదే్శ్ అభివృద్ది బాధ్యతను తనపై వేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావాలన్న కోటి ఆశలతో సింగపూర్ పర్యటన వెళ్లారు.  బేగంపేట విమానాశ్రయం నుంచి పదిహేనుమంది అధికార బృందంతో ప్రత్యేక విమానంలో బయల్దేరారు. సింగపూర్ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్‌ను బహుముఖ అభివృద్ధి మార్గంలో నడిపించాలన్న లక్ష్యంతో రాష్ట్ర బలాలను ఆ దేశం ముందు ఆవిష్కరించేందుకు అయిదు నిమిషాల డాక్యుమెంటరీని వెంట తీసుకెళ్లారు. విభజనానంతర నవ్యాంధ్రకు ఓ మొక్కలా ప్రాణం పోసే సన్నివేశంతో మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్ కంఠహారంలా కళకళలాడే తీరప్రాంతం వరకు అన్ని వనరులనూ సింగపూర్ పారిశ్రామిక వేత్తల ముందు ఆవిష్కరించే లక్ష్యంతో దీన్ని రూపొందించారు. '

అభివృద్ధి మార్గంలో పయనానికి మేం సిద్ధంగా వున్నాం. మీలాంటి ప్రయాణికుడి కోసం వేచి చూస్తున్నాం అన్న ఆహ్వానంతో డాక్యుమెంటరీ ముగుస్తుంది. ఇందులో అమరావతి తీరాన అల్లంత ఎత్తున ఉన్న బుద్ధుడు, కృష్ణా జిల్లా పరిటాలలో ఆకాశమంత ఎత్తున కనిపించే ఆంజనేయుడు, ఎనిమిది వరుసల రహదారులు, గలగల పారే కృష్ణా, గోదావరి నదీ ప్రవాహాలు, ప్రముఖ ఆలయాలు, ఖనిజాలు, పరిశ్రమలన్నీ కనిపిస్తాయి. కలలను నిజం చేసుకోవాలంటే మనలాగే ఆలోచించే స్నేహితుడు ముఖ్యమనే ఇతివృత్తంతో దీన్ని తయారుచేశారు.

కలను సాకారం చేసుకోవాలంటే మనలాగా ఆలోచించే భాగస్వాములు వుంటేనే అధి సాధ్యమవుతుందని, సుదృఢమైన భవిష్యత్తు నిర్మించుకోవాలన్నా ఇద్దరి విలువలు, దార్శనికత ఒకేలా ఉండాలని అలాంటి లక్ష్యంతోనే స్వాగతం పలుకుతున్నాం. ఆంధ్రప్రదేశ్‌కు పరిపుష్టమైన ఆర్థికవ్యవస్థ, అత్యంత అనువైన వాణిజ్య వాతావరణం ఉంది. 2029 నాటికి దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా నిలబడాలన్న సంకల్పమూ ఉంది. సమృద్ధమైన సహజ వనరులే పునాదులుగా, ఉత్సాహపూరితమైన పారిశ్రామిక వాతావరణం ఉన్న రాష్ట్రమని డాక్యూమెంటరీలో రూపొందించారు.

ఆహారం నుంచి చమురు శుద్ధి వరకు, ప్రాథమిక లోహాల నుంచి నాన్‌మెటాలిక్ ఖనిజాల వరకు, రసాయనాలు, రసాయన ఉత్పత్తులు, జౌళి, ఆటోమోటివ్స్, ఐటీ.. ఇలా ఎన్నో రంగాలకు ఇక్కడ అవకాశం ఉంది. ఈ ప్రయాణానికి పర్యటక రంగమే చోదకశక్తి. సహజసిద్ధ ప్రాంతాలు ప్రధాన ఆకర్షణ. మూడు అత్యాధునిక నౌకాశ్రయాలతో భారత్‌లో రెండో అతి సుదీర్ఘమైన తీరప్రాంతం.. ప్రతి మూలకూ రైలు, రహదారి, విమాన రవాణా అందుబాటులో ఉండటం అదనపు బలం. మెట్రో రైళ్లు ట్రాఫిక్ విధానంలో మార్పునకు శ్రీకారం చుడుతున్నాయి.

క్లస్టర్ ఆధారిత అభివృద్ధి ప్రణాళిక రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్‌గా, భారత్‌కు ఎల్ఎన్‌జీ ముఖద్వారంగా మార్చనుంది. సమీకృత అంతర్గత జలరవాణా, అత్యాధునిక పట్టణాల రూపకల్పన అభివృద్ధి వేగాన్ని పెంచనున్నాయి. పారిశ్రామిక కారిడార్లు భవిష్యత్తుకు ఎర్రతివాచీ పరువనున్నాయి. ప్రస్తుతానికి ప్రణాళిక తయారైంది. ఇక అసలు పయనం మొదలవుతోంది. ముందుకెళ్లడానికి మేం సిద్ధమయ్యాం. సహప్రయాణికుడి కోసం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌కు ఇదే మా ఆహ్వానం'' అని చంద్రబాబు ముక్తాయిస్తారు. సింగపూర్ సూర్యుడు ఉదయించేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందన్న గ్రాఫిక్‌తో ఈ 5 నిమిషాల డాక్యుమెంటరీ పూర్తవుతుంది. దీనిని దక్షిణాసియా సదస్సులో ప్రదర్శించనున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles