Penumaka farmers angry on chandrababu mind game on ap capital land pooling

ap capital, penumaka, tadepalli, guntur district, bar association members, vijayawada, AP Government, AP CM, chandrababu, farmers

penumaka farmers angry on chandrababu mind game on ap capital land pooling

మా డిమాండ్లను పరిష్కరించి భూములు తీసుకోండి..

Posted: 11/12/2014 01:19 PM IST
Penumaka farmers angry on chandrababu mind game on ap capital land pooling

రాజధాని ప్రతిపాదిత ప్రాంత రైతులు రాష్ట్ర ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాలపై మండిపడ్డారు. తమ అనుమానాలను నివృత్తి చేయకుండా భూములను ల్యాండ్ పుల్లింగ్ విధానంతో లాక్కోడాన్ని తాము అంగీకరించమన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించిన పిమ్మట తమ భూములను తీసుకోవచ్చునని తేల్చి చెబుతున్నారు. ఇదే విషయాన్ని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో రాజధానికి భూములిచ్చే విషయంలో రైతుల అభిప్రాయూలను సేకరించేందుక వచ్చిన విజయవాడ, గుంటూరు బార్ అసోసియేషన్ సభ్యులకు తెలిపారు.

తమ భూములు లాక్కొని పొట్టలు కొడతారా? మమ్మల్ని, మా కుటుంబాలను రోడ్లపైకి నెడతారా? మా సమాధులపై అందమైన రాజధాని కడతారా...? అంటూ మండిపడ్డారు. రైతుల అభిప్రాయాలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని బార్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ.. ముందుగా భూసేకరణపై నెలకొన్న అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. ఎకరా భూమికి ఎంత డబ్బును పరిహారంగా చెల్లిస్తారో ఖచ్చితంగా చెప్పాలని,  ప్రతి ఎకరాకు అభివృద్ధి చేసిన భూమిలో 1,500 గజాల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ భూమిని తీసుకున్న చోటే తమకు భూములను ఇవ్వాలన్నారు. రోడ్లు, కరకట్టలకు ఆనుకుని భూములున్న రైతులకు భూసేకరణ అనంతరం అభివృద్ధి చేసి ఇచ్చే భూమిని కూడా రోడ్డు పక్కదే ఇవ్వాలన్నారు.

ల్యాండ్ పుల్లింగ్ విధానంలో భాగంగా తమ భూములను తీసుకుంటున్న ప్రభుత్వం ఎంతకాలంలో తమకు భూములను కేటాయిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉండవల్లి, పెనుమాక ప్రాంతాల్లో సారవంతమైన 3 పంటలు పండే భూముల్లో కౌలు రూ. 50 వేల వరకు ఉన్న విషయాన్ని గుర్తుంచుకుని అందుకు అనుగూణంగా పరిహారం ఇవ్వాలని కోరారు. పరిహారం కూడా ప్రభుత్వం చెప్పే కాలపరిమితి మొత్తాన్ని లెక్కించి ఒకేసారి ఇవ్వాలని ఈ డిమాండ్లన్నింటినీ ప్రభుత్వానికి తెలియజేయాలని వారు బార్ అసోసియేషన్ సభ్యులను కోరారు. తమకు ఇచ్చే పరిహారం, భూముల కేటాయింపులను ప్రభుత్వ హామీలుగా కాక శాసనసభలో చట్టం చేసిన తరువాతే భూసేకరణకు చర్యలు ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేశారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles