Maharashtra fadnavis govt wins trust vote bjp s bagde to be assembly speaker

BJP, Shiv sena, Maharastra, differnences, Uddav thakery, PM, Narendramodi, Devendra fednavis, congress, NCP. manikRao Thakrey, speaker elections, unianimous, voice vote

Maharashtra: Fadnavis govt wins trust vote; BJP's Bagde to be Assembly Speaker

విశ్వాస పరీక్షలో నెగ్గిన ఫెడ్నవిస్ ప్రభుత్వం..

Posted: 11/12/2014 02:42 PM IST
Maharashtra fadnavis govt wins trust vote bjp s bagde to be assembly speaker

మహారాష్ట్రలో కొలవుదీరిన కొత్త ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫెడ్నవిస్ నేతృత్వంలోని ప్రభుత్వంపై గత కొన్నాళ్లుగా నెలకోన్న ఉత్కంఠకు తొలగిపోయింది. ముందునుంచి అచితూచి అడుగువేస్తున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పెడ్నవిస్.. అన్ని తాను అనుకునట్టే ప్రణాళికా బద్దంగా ముగించారు. దేశ ప్రజల ఉత్కంఠతతో పాటు ప్రతిపక్షాల అనుమానాలను పటాపంచలు చేస్తూ.. ఆయన ఇవాళ నిండు కోలువులో తన ప్రభుత్వ బలాన్ని నిరూపించుకున్నారు. మూజువాణి ఓటుతో బీజేపి ప్రభుత్వం సభా సభ్యుల విశ్యాసాన్ని పొందింది. ఇవాళ మధ్యాహ్నం జరిగిన బలనిరూపణ పరీక్షలో దేవేంద్ర ఫెడ్నవిస్ ప్రభుత్వం విశ్వాస పరీక్షను నెగ్గిందని స్పీకర్ హరిబాబు బాగ్దే ప్రకటించారు.

మహారాష్ట్రలో బీజేపీతో కలసి అధికారాన్ని పంచుకోవాలని చివరి వరకు యత్నించి.. చివరకు ప్రతిపక్షంలో కూర్చున్న శివసేన ఫెడ్నవిస్ ప్రభుత్వానికి రోజుకో విధంగా వ్యవహరించింది. తమ డిమాండ్లు, కండీషన్లకు బీజేపి ప్రభుత్వం లొంగకపోయే సరికి చివరకు పాతికేళ్ల మైత్రిబంధాన్ని పూర్తిగా తెగదెంపులు చేసుకుంది. మొత్తం 288 మంది సభ్యులన్న మహారాష్ట అసెంబ్లీలో బీజేపి పక్షాన 122 మంది సభ్యులు వుండగా, 41 మంది ఎన్సీపీ సభ్యులు కూడా మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వం సునాయాసంగా బలాన్ని నిరూపించుకుంది. మహారాష్ట్రలో మళ్లీ అప్పుడే ఎన్నికలు రావడం ఇష్టం లేక, రాష్ట్ర అభివృద్ది కోసం, ప్రజల సంక్షేమం కోసం బీజేపికి మద్దతునిస్తామని ముందునుంచి చెబుతున్న ఎన్సీపీ అనుకున్నట్లుగానే బీజేపికి మద్దతు తెలపడంతో పెడ్నవిస్ ప్రభుత్వం సభ విశ్వాసాన్ని పొందగలిగింది.

63 మంది సభ్యులున్న శివసేన, 42 మంది సభ్యులున్న కాంగ్రెస్.. ఇద్దరు కలిసినా.. బీజేపికి ఎలాంటి ఢోకా లేకపోవడంతో.. బీజేపి వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. అయితే  విడిగా ఓటింగ్ నిర్వహించాలని, మొత్తం సభ్యుల నుంచి ఓటింగ్ తీసుకోవాలని, విడివిడిగా లెక్కించాలంటూ శివసేన పట్టుబట్టింది. డివిజన్ చేయాల్సిందేనని భీష్మించుకుంది. అందుకు స్పీకర్ హరిభావు బాగ్డే నిరాకరించారు. దాంతో శివసేన ఎమ్మెల్యేలు ఒక్కసారిగా వెల్లోకి దూసుకెళ్లారు. అయితే ఆ సమయంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి మద్దతుగా నిలిచింది. దాంతో మూజువాణీ ఓటుతో విశ్వాస పరీక్షలో ఫడ్నవిస్ సర్కారు సులభంగా గట్టెక్కేసింది.

మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక కూడా ఏకగ్రీవంగా ముగిసింది. ఓటింగ్ కు కొన్ని గంటల ముందు ప్రతిపక్ష శివసేన, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ఉపసంహరించుకున్నాయి. దీంతో బీజేపీ అభ్యర్థి హరిభావు బాగ్డే ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికయ్యారు. ఔరంగాబాద్ జిల్లా నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన హరిభావు బాగ్దేను స్పీకర్ పదవి వరించింది. స్పీకర్ ఎన్నికకు తొలుత శివసేన నుంచి విజయ్ ఔటి, కాంగ్రెస్ నుంచి వర్షా గైక్వాడ్ స్పీకర్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. అయితే, తర్వాత ఇరుపార్టీలూ అభ్యర్థులను ఉపసంహరించుకున్నాయి. దీంతో స్పీకర్ పదవిని కూడా బీజేపి గెలుచుకుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles