Ys jagan plans to protests againt tdp party along with farmers and dwakra women

ys jagan mohan reddy, ys jagan latest news, ys jagan campaign, ys jagan protests, ys jagan press meet, ys jagan comments tdp party, ys jagan comments chandrababu naidu, tdp party news, andhra pradesh farmers loan weavers, andhra pradesh dwakra group women, vizag hudhud cyclone, vizag hudhud victims, ys jagan vizag tour

ys jagan plans to protests againt tdp party along with farmers and dwakra women for not solving their problems yet now

జగన్ మంత్రం ఫలిస్తుందా..? బెడిసికొడ్తుందా..?

Posted: 10/20/2014 09:41 PM IST
Ys jagan plans to protests againt tdp party along with farmers and dwakra women

సార్వత్రిక ఎన్నికల ముందు తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు టీడీపీ పార్టీ బాగానే దెబ్బకొట్టింది. ఎవరూ ఊహించని రీతిలో భారీ మెజార్టీతో గెలిపొంది, ఆంధ్రప్రదేశ్ అధికారాన్ని చేజిక్కించుకుంది. అంతే... అంతవరకు టీడీపీ పార్టీ మీద ఓ మోస్తరు ఆగ్రహాన్ని చూపించే జగన్.. ఆ పార్టీ గెలుపొందిన తరువాత వరుసగా విమర్శలు చేస్తూనే వున్నారు. ఇప్పటికీ ఆ పార్టీ మీద ప్రజలకు ద్రోహం చేస్తుందంటూ ఆరోపణలు కొనసాగిస్తూనే వున్నారు. టీడీపీ పార్టీని దెబ్బకొట్టడానికి రకరకాలుగా తనవంతు ప్రయత్నాలు కూడా చేశారు. ప్రజలను తనవైపు తిప్పుకోవడానికి ఆ పార్టీ పరాజయాల్ని సైతం ప్రజలముందుకు తీసుకొచ్చారు. కానీ ఇంతవరకు ఏ ఫలితం దక్కలేదు. అయినా జగన్ వెనక్కి తగ్గకుండా తనదైన రీతిలో రకరకాల మంత్రాలను ప్రయోగిస్తూనే వున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా మరోసారి టీడీపీకి వ్యతిరేకంగా సరికొత్త నినాదంతో ముందుకువస్తున్నట్లు సమాచారం!

టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి చాలాకాలం అయినా.. ఇంతవరకు రైతురుణమాఫీ, ఇతర ప్రజాసంక్షేమ పథకాలు, రాజధాని, ఇంకా ఇతర సమస్యల మీద వివరణ ఇవ్వలేదంటూ ఆయన ఇప్పటికే టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నోసార్లు నిరసనలు చేశారు. లేనిపోని హామీలు ప్రకటిస్తూ టీడీపీ ప్రజలను మభ్యపెడుతోందని.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ జనానిని మోసం చేయడం తప్ప ఇంతవరకు ఏ న్యాయం చేయలేదని ఆయన మరోసారి ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీ ప్రభుత్వం ఎన్నో అన్యాయాలు అక్రమాలు చేస్తోందని.. వాటికి నిరసన తెలుపుతూ నవంబర్ 5వ తేదీన మండల కార్యాలయాల వద్ద ప్రదర్శనలు చేయాలని జగన్ పిలుపునిచ్చారు. ఈ నిరసనలో రైతులు, డ్వాక్రా మహిలు కూడా తమవంతు నిరసనలు తెలపాలంటూ ఆయన కోరారు. ఆయనతోపాటు ఇతరవర్గాలు కూడా ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంపై వ్యతిరేకంగా నిరసనలు చేయాలంటూ ప్రకటనను విడుదల చేశారు.

‘‘ఏపీ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే నాలుగు నెలలు కావస్తున్న ఇంతవరకు రైతుల రుణమాఫీలు చేయలేదు.. రీషెడ్యూల్ కూడా చేయలేదు. క్రాప్ ఇన్సూరెన్స్ కూడా లేదు. రైతులు తీసుకున్న రుణాలపై ఇంకా 14 శాతం వడ్డీ పడుతుంది కానీ.. వాటి నుంచి విముక్తి మాత్రం పొందడంలేదు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు రుణాలు ఎలా చెల్లిస్తారు’’ అంటూ జగన్ ప్రశ్నించారు. ఇన్ని వైఫల్యాలు పెట్టుకుని కూడా ఇంకా ఏపీ ప్రభుత్వం ప్రజలకు దొంగహామీలతో మభ్యపెడుతోందని కానీ.. వున్న సమస్యలను త్వరగా పరిష్కరించే మార్గాలను వెతకలేకపోతోందని ఆయన విరుచుకుపడ్డారు. కాబట్టి.. ఆ పార్టీకి వ్యతిరేకంగా నిరసనలు తెలపడానికి ప్రజలందరూ తరలిరావాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. మరీ.. ఏపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఆయన వేసిన ఈ కొత్త మంత్రాన్ని ప్రజలు స్వీకరిస్తారా..? ఆయన అనుకున్నట్లుగానే ప్రజలు వస్తారా..? లేక ముందులాగే ఇది మంత్రం కూడా ఫెయిల్ అవుతుందా..? అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles