The health benefits with green papaya which contains number of nutrients

green papaya, green papaya health benefits, green papaya juice, green papaya salads, the health benefits of green papaya, the varities of green papaya, health tips, health tips green papaya, green papaya heart attack problems, health problems, green papaya

the health benefits with green papaya which contains number of nutrients and chemicals for human bodies and also increase the beauty levels

పచ్చిబొప్పాయి తినండి.. ఆరోగ్యంగా వుండండి!

Posted: 10/20/2014 09:03 PM IST
The health benefits with green papaya which contains number of nutrients

మానవ ఆరోగ్యానికి కావలసిన ముఖ్యమైన పోషకాలు సహజంగా లభించే ఆహారపదార్థాల్లో పుష్కలంగా లభ్యమవుతాయి. అటువంటివాటిల్లో పచ్చిబొప్పాయి ఒకటి! సాధారణంగా ప్రతిఒక్కరు పండిన బొప్పాయిలనే ఎక్కువగా తినడటానికి ఇష్టపడతారు కానీ.. ఆరోగ్యానికి కావలసిన పోషకపదార్థాల రీత్యా పచ్చిబొప్పాయి తినడమే ఎంతో మేలని నిపుణులు బల్లగుద్దిమరీ చెబుతున్నారు. పండిన బొప్పాయిల్లో కూడా పోషకాలు వుంటాయి కానీ.. పచ్చిబొప్పాయిల్లో వుంటే పోషకాల కంటే తక్కువేనని కొన్ని పరిశోధనల ద్వారా శాస్త్రజ్ఞులు వెల్లడిస్తున్నారు. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ ఏ తదితరులతోపాటు ఇంకా చాలా పోషకాలు వుంటాయని స్పష్టం చేస్తున్నారు.

పచ్చిబొప్పాయిలో వుండే పోషకాలు మానవుని ఆరోగ్యంతోపాటు శరీరాకృతిని, అందాన్ని మరింతగా మెరుగుపరుస్తాయి. ఇందులో వుండే పోషకవిలువలు, ఎంజైములు శరీరంలో వుండే జీర్ణవ్యవస్థను మెరుగుపర్చడంలో ప్రముఖపాత్రను పోషిస్తాయి. ఈ పండుతో అమీబియాసిస్, నులిపురుగుల బెడద చాలావరకు తప్పుతుందని.. తద్వారా, అజీర్ణం, పుల్లని తేన్పులు వంటి బాధలు నెమ్మదిగా దూరమవుతాయి. ప్రతి 100 గ్రాముల పచ్చి బొప్పాయిలో కేవలం 39 కెలోరీలు మాత్రమే ఉంటాయి కాబట్టి దీన్ని తినడం ద్వారా శరీరంలో అనవసరంగా కొవ్వు చేరే అవకాశమే వుండదు. దీన్ని సలాడ్ల రూపంలోనూ, జ్యూస్ గానూ తీసుకోవచ్చు.

అలాగే ఇందులో వుండే కొన్ని పోషకాలు ముఖంపై వుండే మొటిమలు, మచ్చలతోపాటు పలురకాల చర్మవ్యాధులను పూర్తిగా నయంచేయడంలో చాలావరకు దోహదపడుతాయి. చర్మానికి చెందిన మృతకణాలను తొలగించి.. కొత్తకాంతిని అందించి మరింత సౌందర్యంగా కనిపించేందుకు సహాయపడుతుందీ బొప్పాయి! శరీరంలో రక్తప్రసరణ సాఫీగా జరగడంలో దీనిపాత్ర అమోఘం! రక్తపోటు స్థాయిని నిరంతరం సరైన స్థితిలో వుంచుతూ.. గుండెకు సంబంధించిన వ్యాధుల నుంచి కాపాడుతుంది. ఇక, బొప్పాయి ఆకులను చింతపండు, ఉప్పుతో కలిపి తీసుకుంటే మహిళల్లో బహిష్టు కారక నొప్పులు తగ్గుముఖం పడతాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : green papaya  health tips  green papaya health  heart attack disease  

Other Articles