A prisoner throws fecal on judge face in court hall

indian prisoners, indian prisons, tamilnadu prisons, prisoner throws fecal on judge face, tamilnadu court, tamilnadu news, latest updates, fecal infections, fecal problems treatment

a prisoner throws fecal on judge face in court hall : in virudh nagar court of tamilnadu a prisoner bhagyaraj throws fecal on judge face immediately police taken into custody this created shock to all in court premises

షాకింగ్ : జడ్జి ముఖంపైకి మలం విసిరిన ఖైదీ

Posted: 10/21/2014 09:29 AM IST
A prisoner throws fecal on judge face in court hall

చట్టాన్ని గౌరవిస్తూ.., న్యాయాన్ని కాపాడే న్యాయమూర్తిపై తమిళనాడులోని ఓ ఖైదీ మలం విసిరాడు. స్థానికంగా సంచలనం కల్గించిన ఈ ఘటన విరుధ్ నగర్ లో జరిగిది. మేలదయిల్ పట్టి గ్రామానికి చెందిన భాగ్యరాజ్ దొంగతనం ఆరోపణలపై జులై 27న అరెస్టయ్యాడు. అతడిని స్థానిక జైలులో పోలిసులు రిమాండ్ ఖైదీగా ఉంచారు. ఈ క్రమంలో కేసు విచారణ నిమిత్తం సోమవారం రోజు కోర్టుకు తీసుకువచ్చారు.

విచారణ జరుగుతుండగా తన చేతిలో ఉన్న చిన్న సంచీలో ఉన్న మలాన్ని తీసి జడ్జిపై విసిరాడు. ఈ ఘటనతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలిసులు భాగ్యరాజ్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణను తాత్కాలికంగా నిలిపివేశారు. జడ్జిపైకి మలం విసరటంపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయమూర్తిపైనే ఇలా ప్రవర్తించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని పలువురు అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉండగా.., కోర్టులోకి భాగ్యరాజ్ మలం ఎలా తీసుకువచ్చాడు అనే విషయం పోలిసులకు అర్ధం కావటం లేదు. కట్టుదిట్టమైన భద్రత ఉండే కోర్టులోకి అప్పటివరకు తమతోనే ఉన్న ఖైదీ మలం తీసుకువచ్చి.., న్యాయమూర్తిపై విసరటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలిసులు వెల్లడించారు.

పట్టణంలోని సొత్తూర్ లో ఉన్న కోర్టు

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : judge  fecal  prisoner  latest updates  

Other Articles